బిజెపి ప్రభుత్వం రెండో సారి  అధికారంలోకి వచ్చిన తర్వాత 370 ఆర్టికల్ రద్దు అనే సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే 370 ఆర్టికల్ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్, లడక్ లని  రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తూ  కొత్త భారతదేశ రాజకీయ  చిత్రపటాన్ని విడుదల చేసింది కేంద్రం. అయితే జమ్మూ కాశ్మీర్ ను అసెంబ్లీ గల కేంద్రపాలిత ప్రాంతంగా... లడక్ ను  అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది  కేంద్రం. అయితే దీనికి సంబంధించిన భారతీయ పొలిటికల్ మ్యాప్ ను అక్టోబర్ 21న విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇందులో 28 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి . అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన భారతదేశ పొలిటికల్ మ్యాప్ లో అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లు ఎరుపురంగులో ముద్రించింది. అయితే దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు రాజధానిని చేర్చిన కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతిని మాత్రం భారతదేశ పొలిటికల్ మ్యాప్ లో సూచించలేదు.

 

 

 

 అయితే ఈ మ్యాప్ చూసిన ఏపీ ప్రజలు అందరూ ఆశ్చర్యపోయారు.. అన్ని రాష్ట్రాల రాజధాని పేర్లను సూచించిన కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతి పేరును మాత్రం ఎందుకు సూచించలేదు అంటూ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశం ఆంధ్ర రాజకీయాల్లో దుమారం రేపింది. అధికార ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని మార్పు చేస్తామంటూ చెబుతున్నారని ఇప్పుడు ఏకంగా భారతీయ చిత్రపటంలోని అమరావతి లేకుండా జగన్  ప్రభుత్వం చేసింది అంటూ  ప్రతిపక్ష టిడిపి పార్టీ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే భారత రాజకీయ చిత్రపటంలో ఏపీ రాజధాని అమరావతి చేర్చక పోవడం గురించి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తాజాగా శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్ సభలో  లేవనెత్తారు. భారత దేశ రాజకీయ చిత్రపటంలో అమరావతికి స్థానం  కల్పించకపోవడం ఏపీ ప్రజలకే కాదు దేశ ప్రధాని మోడీ కూడా అవమానంమంటూ ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. 

 

 

 

 అయితే కేంద్రం విడుదల చేసిన భారత రాజకీయ చిత్రపటంలో అమరావతి స్థానం కల్పించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పై ప్రభావం చూపే అవకాశం ఉందంటూ పార్లమెంట్లో అభిప్రాయపడ్డారు. అయితే ఆయన లోక్ సభలో అమరావతి అంశాన్ని లేవనెత్తి మరుసటి రోజే కేంద్రం కొత్తగా భారత రాజకీయ చిత్రపటాన్ని  విడుదల చేయడం గమనార్హం. ప భారత రాజకీయ చిత్రపటంలో ఏపీ రాజధాని అమరావతి సూచిస్తూ  చిత్రపటాన్ని విడుదల చేసింది ప్రభుత్వం. అన్ని రాష్ట్రాల రాజధానులు ఎరుపు రంగులో గుర్తించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని కూడా ఎరుపురంగు అక్షరాలతో లికిస్తూ  కొత్త భారత రాజకీయ చిత్రపటాన్ని  విడుదల చేసింది కేంద్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: