ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే . అయితే జబర్దస్త్ షో మొదలైనప్పటినుండి  అందులో జడ్జ్ గా నాగబాబు తెలుగు ప్రజలందరికీ దగ్గరయ్యారు. జబర్దస్త్ అంటే  నాగబాబు... నాగబాబు అంటే  జబర్దస్త్ అనేంతలా  ప్రభావితం చేశారు మెగా బ్రదర్ నాగబాబు. అయితే జబర్దస్త్ షో మొదలైనప్పటి నుంచి జడ్జ్ గా  మెగా బ్రదర్ నాగబాబు కొనసాగుతున్నారు. దీంతో అటు జబర్దస్త్ ప్రేక్షకులకు కూడా నాగబాబు నవ్వులు,  నాగబాబు కామెంట్స్ కి ఎక్కువగా అలవాటు పడిపోయారు. దీంతో నాగబాబు లేకుండా ఏదైనా జబర్దస్త్ ఎపిసోడ్ వచ్చిందంటే దాంట్లో ఏదో వెలితి కనిపిస్తున్నట్లుగా ఫీల్ అవుతున్నారు జబర్దస్త్ ప్రేక్షకులకు. అయితే ప్రస్తుతం జబర్దస్త్ జడ్జ్ గా  ఉన్న నాగబాబు జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడం సంచలనంగా మారింది. జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి జబర్దస్త్  జడ్జ్ గా  కొనసాగుతున్న నాగబాబు... ఇంత సడన్గా జబర్దస్త్ షో నుండి తప్పుకోవటానికి గల కారణాలు ఏమిటి అనేది ప్రస్తుతం బుల్లితెరపై చర్చనీయాంశంగా మారింది. 

 

 

 

 అయితే జబర్దస్త్ నుంచి తాను  వెళ్లి పోవడానికి గల కారణాలు ఏంటి అన్నది  నాగబాబు యూట్యూబ్ ఛానెలైన  నా ఛానల్ నా ఇష్టం అనే చానల్ ద్వారా బయటపెట్టారు మెగాబ్రదర్ నాగబాబు. ఈరోజు ప్రసారమయ్యే జబర్దస్త్ ఎపిసోడ్ తో  జబర్దస్త్ లో తన ప్రయాణం ముగిసిపోతుంది అని మెగా బ్రదర్ నాగబాబు తెలిపారు. అయితే తనకు తానుగా జబర్దస్త్ నుంచి తప్పుకుంటానని అని ఎప్పుడూ అనుకోలేదని నాగబాబు అన్నారు. జబర్దస్త్ లో నిర్మాతలతో వ్యాపారపరమైన ఐడియాలజీ లో తేడాల వలన జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే రెమ్యునరేషన్ వల్లే తాను తప్పుకుంటున్నట్లు చాలా వార్తలు వస్తున్నాయి... తనకు రెమ్యూనరేషన్ ముఖ్యం కాదని తన స్థాయికి తగ్గ రెమ్యునరేషన్ కాకపోయినప్పటికి కూడా బాగానే ఇచ్చారంటూ మెగా బ్రదర్ నాగబాబు తెలిపారు.

 

 

 

 అంతేకాకుండా తాను  ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు జబర్దస్త్ లో అవకాశం ఇచ్చిన జబర్దస్త్ యాజమాన్యానికి నాగబాబు కృతజ్ఞతలు తెలిపారు. అయితే జబర్దస్త్ నుంచి తప్పుకోవడానికి గల కారణాలు పరిస్థితుల గురించి రాబోయే రోజుల్లో వెల్లడిస్తా అంటూ నాగబాబు తెలిపారు. ఈ క్రమంలో  నాగబాబు జబర్దస్త్ నుంచి తప్పుకోవడానికి కేవలం రెమ్యూనరేషన్ ఇతర చిన్న చిన్న కారణాల కాకుండా  వేరే కారణాలు ఉన్నాయని   చర్చ సాగుతోంది. ఇప్పటికే నాగబాబు జీ తెలుగు లో ప్రసారమయ్యే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి అనే షోలో  జడ్జ్ గా  ప్రత్యక్షమయ్యారు. అయితే నాగబాబుతో పాటు మరో ముగ్గురు టీం లీడర్స్ కూడా ఈ షోలోకి  వెళ్తున్నారు అని ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: