పెళ్ళి చూపులు సినిమా తో హీరోగా మారినప్పటికి విజయ్ దేవరకొండను సెన్సేషనల్ స్టార్‌గా మార్చింది మాత్రం 'అర్జున్ రెడ్డి'. కంప్లీట్ బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.  తెలుగులోనే కాదు 'కబీర్ సింగ్' గా హిందీ రీమేక్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్‌ అందుకుంది. ఇదే సినిమాను తమిళంలో కూడా రీమేక్ చేశారు. అయితే అక్కడ గిరీశాయ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో 'ఆదిత్య వర్మ'గా తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి తమిళ తంబీలకు పూనకాలు తెప్పిస్తోంది.

'ఆదిత్య వర్మ' సినిమా ద్వారా ప్రముఖ నటుడు చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. అందువల్లే ఈ సినిమాకు అంత క్రేజ్ వచ్చింది. చిన్న చియాన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీని చూడటానికి జనాలు థియేటర్లకు క్యూ కడుతున్నారట. 'అర్జున్ రెడ్డి' సినిమాను దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అద్భుతంగా తెరకెక్కించారు. సినిమాలో ఇది అవసరంలేదు అనే సీన్ ఒక్కటి కూడా ఉండదు. అందుకే హిందీ వర్షన్‌కు ఆయనే దర్శకుడు కావడంతో 'అర్జున్ రెడ్డి' ని ఉన్నది ఉన్నట్టు దించేశారు. ఇప్పుడు అలానే తమిళంలోనూ ఇదే ఫార్ములాను ఫాలో అయ్యారు. ఒరిజినల్ వర్షన్‌లో ఎలాంటి మార్పులు చేయకుండా తమిళ వర్షన్‌ను తెరకెక్కించడంతో కోలీవుడ్  లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

వాస్తవానికి 'ఆదిత్య వర్మ' సినిమాని ముందు ప్రముఖ దర్శకుడు బాలా తెరకెక్కించాడు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. అయితే, ఒరిజినల్ స్టోరీలో కొన్ని మార్పులు చేసి బాలా తెరకెక్కించడం జరిగింది. ఇది విక్రమ్‌తో పాటు చిత్ర నిర్మాతలకు నచ్చలేదట. దీంతో బాలాకు వారికి విభేదాలు వచ్చాయి. బాలా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. సినిమా చాలా రోజులు ఆగిపోయింది. బాలా స్థానంలో గిరీశాయను దర్శకుడిగా తీసుకుని మళ్లీ రీషూట్ చేశారు. దీంతో సినిమాపై విమర్శలు వచ్చాయి. ఈ సినిమా ఆడదని, ఒరిజినల్ వర్షన్‌ను పాడు చేసేస్తున్నారని చాలా మంది అన్నారు. ఇప్పుడు వారందరికీ దిమ్మతిరిగే షాకిచాడు ధృవ్. మొత్తానికి టాలీవుడ్ విజయ్ దేవరకొండ లా కోలీవుడ్ లో ధృవ్ మ్యాజిక్ చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: