లేడి బాస్ విజయశాంతి అంటే తెలియని వాళ్ళు ఉండరేమో రౌడీలను చితక కొట్టడానికి, మావోయిస్టులను మట్టు కలపడానికి ఉక్కుపాదం విజయశాంతి.. ఈమె సినిమాలు చాలా వరకు పోరాట నేపథ్యంలో సాగిన సినిమాలే. పెత్తనం దొరికే పెద్దదొరలనైనా, చిన్నచూపు చూసే చిన్నరాయులనైనా కూడా ఒంటి చేతితో మట్టు పెట్టగలిగే మహిళ విజయ శాంతి. అందుకే ఈమెను లేడి బాస్ అని అంటారు. చేసిన సినిమాలు కూడా అలానే ఉంటాయి కాబట్టి ఇప్పటికి విజయశాంతి సినిమాలు ఆడుతున్నాయి.  

వివరాల్లోకి వెళితే.. దాదాపుగా 23 ఏళ్ళు సినిమాలకు దూరంగా రాజకీయాల్లో ఉండి అప్పటి నుండి ఇప్పటివరకు ఆమె సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంది. ఇకపోతే ఈమె చాలా కాలంగా సినిమాల్లోకి రావాలని అనుకున్న, చాలా మంది అడిగిన కూడా ఈమె సముఖత చూపలేదు 23 ఎల్లా తర్వాత విజయశాంతి మళ్ళీ సినిమాల్లాలోకి నటించాడని ఒప్పుకుంది. 

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వఁరు సినిమాలో నటిస్తుంది. హీరోయిన్ అంటే అందాల ప్రదర్శనే కాదు.. హీరోకు దీటుగా ఇజం చూపించగలదని నిరూపించారు. 2006 వరకు సినిమాలు చేసి, ఆ తర్వాత రాజకీయాల్లో బిజీగా గడిపిన విజయశాంతి.. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

13 ఏళ్ల తర్వాత ముఖానికి రంగు వేసుకున్నా.. తనలోని రాజసాన్ని, పౌరుషాన్ని అద్భుతంగా పలికించారామె. కనుల చూపు, ఆమె చెప్పిన డైలాగ్ బాగున్నాయి. గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడని అన్న డైలాగ్ రాములమ్మ అభిమానులకు కిక్ ఇచ్చినట్లైంది.ఇక, ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం దాదాపు 10 కేజీల బరువు తగ్గానని, దాని కోసం జిమ్‌లో రోజుకు రెండు గంటల పాటు కష్టపడ్డానని విజయశాంతి చెప్పిన విషయం తెలిసిందే. కాగా.. షూటింగ్ సందర్భంగా మహేష్‌‌తో చాలా సరదా అనిపించిందని, ఆయన తనను అమ్మా అని, మేడం అని పిలిచారని చెప్పారు. సూపర్ స్టార్ కృష్ణలాగే మహేష్ తనపని తాను చేసుకుంటారని విజయశాంతి అన్నారు. టీజర్ లో ఈమె చాలా బాగా చేసిందని నెటిజన్లు అంటున్నారు.. మరి సినిమా ఉండబోతుందో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: