కొణిదెల ఇంటి వారి కోడలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య సోషల్ మీడియాలో సామాజికంగా మరియు వ్యాపారపరంగా చాలా చురుగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఇటీవల ప్రధాని మోడీ దేశంలో ఉన్న సినిమా తారల సమావేశం భారత ప్రభుత్వం నిర్వహించిన సందర్భంలో దక్షిణాది భారతదేశానికి చెందిన చలనచిత్రరంగ ప్రముఖులు ఆ సమావేశంలో ఎక్కడ లేకపోవడంతో సౌత్ ఇండస్ట్రీ లో ఉన్న ఏ ఒక్కరూ చెయ్యని సాహసం చేసి ప్రధాని మోడీ ని ప్రశ్నించింది రామ్ చరణ్ భార్య ఉపాసన. అంతే కాకుండా తన భర్త రామ్ చరణ్ కి సంబంధించిన విషయలు మరి ఇంకా అనేక విషయాలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

 

ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఇంటర్నెట్లో ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది రామ్ చరణ్ భార్య ఉపాసన. విషయంలోకి వెళితే ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ లో కామినేని కొణిదల పేరుతో ఓ చానల్ ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ చానల్ ద్వారా మానవ ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని హెల్త్ టిప్స్ మరియు అదే విధంగా అనేక చిట్కాలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా...సమాచారాన్ని అందిస్తూ వీడియోల ద్వారా తెలియజేస్తూ ఉంటుంది.

 

రీసెంట్ గా ఉపాసన సానియా మీర్జా, సల్మాన్ ఖాన్, సమంత లాంటి సెలెబ్రిటీలతో ఇంటర్వ్యూలు చేయడంతో సబ్ స్క్రైబర్లు వేగంగా పెరిగారు. దీనితో ఉపాసనకు యూట్యూబ్ నుంచి సిల్వర్ ప్లగ్ మెమెంటో లభించింది. ఈ విషయాన్ని ఉపాసన అభిమానులకు తెలియజేస్తూ తన సంతోషాన్ని వ్యక్తపరిచింది. ఈ ఘనత సాధించడానికి మీ ఆదరణే కారణం అని తెలిపింది. ఇదే క్రమంలో తన భర్త రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ఈ విజయానికి వెనుక ఉన్నది రామ్ చరణ్ అంటూ పొగడ్తల వర్షం కురిపించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: