ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) యొక్క గోల్డెన్ జూబ్లీ ఎడిషన్ గోవాలోని పనాజీలో ఐఎఫ్‌ఎఫ్‌ఐ 2019 నటులు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ లు ముఖ్య అతిథులుగా ఉత్సవాలను ప్రారంభమయ్యాయి. నవంబర్ 28 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి అని ఐఎఫ్ఎఫ్ఐ తెలిపింది.

 

 ఐఎఫ్ఎఫ్ఐ గురించి తెలుసుకుందామా మరి..1952 లో స్థాపించబడిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) ఆసియాలో అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇది కూడా ఒకటి అనే చెప్పాలి. ప్రతి ఏటా ఈ ఉత్సవాలను గోవాలో నిర్వహించగా.. 2004, 35 వ ఎడిషన్ నుండి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా పోటీపడి దాని శాశ్వత వేదికను గోవాకు మార్చుకో గలిగింది. ప్రతి సంవత్సరం నవంబర్ మరియు డిసెంబర్ నెలలలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, చలన చిత్రోత్సవాల డైరెక్టరేట్ మరియు గోవా ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుంది.

 

చలన చిత్రోత్సవాల సందర్భంగా, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ ఫిల్మ్ & టెలివిజన్, పారిస్  యునెస్కో చేత స్థాపించబడిన ఐసిఎఫ్టి-యునెస్కో గాంధీ పతకం (శాంతి, సామరస్యం) యొక్క గాంధేయ విలువలను చిత్రీకరించే చిత్రానికి ఇవ్వడంతో పాటు, ముగింపులో ఉత్తమ చిత్రానికి గోల్డెన్ పీకాక్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది.

 

 నటుడు రజనీకాంత్ కు ఐఎఫ్ఎఫ్ఐ 2019 లో గోల్డెన్ జూబ్లీ అవార్డు యొక్క ఐకాన్ ను అందించడంతోపాటు. చలన చిత్రోత్సవాల యొక్క అత్యున్నత గౌరవమైన ఐఎఫ్ఎఫ్ఐ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ఫ్రెంచ్ నటుడు ఇసాబెల్లె హుప్పెర్ట్ కు ప్రదానం చేయడం జరిగింది. ఈ ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు అందరు కూడా పాల్కొన్నారు.

ఈ సందర్భంగా అమితాబ్  మాట్లాడుతూ.. 'నా విజయాలకు కారణమైన అభిమానులకు ధన్యవాదాలు తెలియచేస్తునాన్ను. నా కష్టాల్లో సుఖాల్లో వారు నా వెంటే ఉన్నారు. వారు నాపై చూపించిన ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటాను అని తెలిపాడు. వారి రుణం తీర్చుకోవాలని నాకు లేదు.. ఎందుకంటే మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ నాతోనే ఉండాలి. రజనీకాంత్ ను నా కుటుంబంలో సభ్యుడిలా నేను  భావిస్తాను అని పేర్కొన్నాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: