ఇటీవ‌లె సురేష్‌ప్రొడ‌క్ష‌న్స్‌ రామానాయుడు స్టూడియోస్‌, మ‌రియు టాలీవుడ్ హీరో న్యాచ‌ర‌ల్ స్టార్ నాని ఇంటిపైన ఐటీ రైడ్స్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. అంతేకాకుండా సురేష్‌బాబు సోద‌రుడు విక్ట‌రీవెంక‌టేష్ ఆదాయ లెక్క‌ల‌ను కూడా ఐటీ అధికారులు త‌నిఖీ చేశారు. స‌డెన్ జ‌రిగిన ఈ ఐటీ రైడ్స్ పై తెలుగు ఇండ‌స్ట్రీ అంతా షాక్ అయింది. అది కూడా ద‌గ్గుబాటి ఫ్యామిలీ పై జ‌ర‌గ‌డంతో మ‌రికాస్త ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది.

 

అలాగే, హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్మెంట్స్ వంటి నిర్మాణ సంస్థలపై కూడా ఐటీ అధికారులు దాడులు చేశారు. పన్ను ఎగవేతలకు సంబంధించి లెక్కలు చూసుకునేందుకు ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహించినట్టు సమాచారం. ఈనెల 20న ఉదయం మొదలైన సోదాలు సాయంత్రం వరకు జరిగాయి.

 

ఈ క్ర‌మంలోనే కింగ్ నాగార్జున ఇల్లు, కార్యాలయాలపై కూడా సోదాలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఇవ‌న్నీ కేవ‌లం అంద‌రి ఊహాగానాలు మాత్ర‌మే కాని అవి జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవు. అయినప్పటికీ కొంత మంది నాగార్జునకు ఫోన్ చేసి మీ ఆస్తులపై ఐటీ రైడ్స్ జరిగాయట కదా అని అడిగ‌డ‌డంతో ఆయ‌న ఎంతో బాద ప‌డ్డాన‌ని సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు.  ఆయన శుక్రవారం ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

 

ఇక‌పోతే కొంద‌రు స్నేహితులు ఫోన్ చేసి  మీ ఆస్తులపై  ఐటీ అధికారులు సోదాలు జరిపారా అంటూ అడిగారు. నాపై వచ్చిన ఇలాంటి వార్తలు చాలా ఇబ్బందికరంగా అనిపించాయి అని ఆయ‌న బాధ‌ను వ్య‌క్తం చేశారు. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3 కొన్ని వారాల క్రితమే విజయవంతంగా ముగిసింది. ప్రస్తుతం ఆయ‌న సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఒక బాలీవుడ్ చిత్రంలో న‌టిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ ప్రధాన పాత్రలలో అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న బ్రహ్మాస్త్రా చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు నాగ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: