బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ గురించి పెద్దగా తెలియని వారు ఉండరు అనే చెప్పాలి. ఇటీవల బాలీవుడ్ లో జరిగిన బిగ్ బాస్ షో పుణ్యమా అని సన్నీ ఫాలోయింగ్ సూపర్ రేంజ్ లో పెరిగిపోయింది. ఎక్కువగా స్పెషల్ హాట్ సాంగ్స్ లో నటించే సన్నీ అంటే కుర్రకారుకు విపరీతమైన మోజు. ఇక అలానే ఆమె కూడా తన సోషల్ మీడియా మాధ్యమాల్లో తన వ్యక్తిగత ఫోటోలు వీడియోలు వంటివి అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. మధ్య మధ్యలో తన హాట్ ఫోటోలు పోస్ట్ చేసి ఫ్యాన్స్ కి కిక్క్ ఇచ్చే సన్నీ, నిన్న ఒక షాకింగ్ వీడియో ని తన సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. 

 

ఒక బాత్ టబ్ నిండా నీళ్లతో పాటు ద్రాక్ష పళ్ళను నింపి ఒక వీడియోని సన్నీ పై చిత్రీకరించారు. అయితే అది చూస్తుంటే ఆమె ఏదో యాడ్ కోసం అలా షూట్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా ఆ వీడియో తాలూకు చిన్న బిట్ ని సన్నీ, తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవడంతో పాటు లక్షలాది వ్యూస్ మరియు కామెంట్స్ దక్కాయి. ఆ వీడియోలో ఆమె స్నానం చేస్తూ, ద్రాక్ష పళ్ళను తన చేత్తో పట్టుకుని సరదాగా ఆడుతున్నట్లు గమనించవచ్చు. 

 

ఇప్పటికే ఆ వీడియోను 25 లక్షల మందికి పైగా వీక్షించడంతో పాటు, నిజమైన సెక్సీ తారవు నువ్వే అంటూ పలువురు నెటిజన్లు ఆమె వీడియోకు వెల్లువలా కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. కాగా మధ్యలో సన్నీ అక్కడక్కడా కొన్ని తెలుగు సినిమాలల్లో కూడా నటించి ఇక్కడి ప్రేక్షకుల నుండి కూడా మంచి క్రేజ్ సంపాదించింది అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆమె వీరమదేవి అనే హిస్టారికల్ మూవీతో పాటు కోకాకోలా అనే మల్టి లాంగ్వేజ్ మూవీలో నటిస్తోంది. వీటితో పాటు రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్న సన్నీ పేరిట కరెన్ జీత్ కౌర్ అనే బయోపిక్ టీవీ సిరీస్ ఇటీవల బాలీవుడ్ లో రిలీజ్ అయి మంచి విజయాన్ని కూడా అందుకుంది.....!!

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

So many crazy captions come to mind 😛😜... #SunnyLeone #LifeonSets

A post shared by Sunny Leone (@sunnyleone) on

మరింత సమాచారం తెలుసుకోండి: