టాలీవుడ్ సీనియర్ హీరోల్లో సూపర్ స్టార్ క్రేజ్ ఉన్న హీరోల్లో నాగార్జున ఒకరు. ముప్పై ఏళ్లు పైబడిన ఆయన కెరీర్లో అనేక వైవిధ్యమైన సినిమాలు చేశాడు. మాస్, కామెడీ, రొమాంటిక్, భక్తిరస ప్రధానమైన సినిమాలెన్నింటిలోనో నటించి మెప్పించాడు. నాగ చైతన్య, అఖిల్ హీరోలయ్యాక తనకు తగిన కథలు సెలక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్న నాగార్జున ఈమధ్య కొన్ని ఫ్లాపుల్లో ఉన్నాడు. మన్మధుడు2 తర్వాత అనేక కథలు విన్న నాగ్ ను ఓ కథ మెప్పించిందని సమాచారం. దీంతో ఆయన చేయబోయే కొత్త సినిమాపై క్లారిటీ వచ్చిందని ఫిల్మ్ నగర్ సమాచారం.

 

 

వంశీ పైడిపల్లి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన సాల్మన్ అనే కోడైరక్టర్ చెప్పిన కథకు నాగ్ ఫిదా అయ్యాడని సమాచారం. ఈ సినిమాలో నాగార్జున్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటించబోతున్నట్టు సమాచారం. దీనిపై పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్ సిద్దం చేయమని నాగార్జున చెప్పినట్టు కూడా వార్తలొస్తున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను మ్యాటినీ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. హీరోయిన్ తోపాటు మిగిలిన నటీనటులు, సాంకేతికవర్గం కూడా త్వరలోనే ఫైనల్ కానున్నట్టు సమాచారం. నాగ్ గతేడాది ఆఫీసర్ అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాడు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవి చూసింది.

 

 

కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడంలో నాగార్జున ఎప్పుడూ ముందుంటాడు. శివతో రామ్ గోపాల్ వర్మ, కేడీతో కిరణ్.. ఇలా కొత్త దర్శకులకు.. కొత్త వారికి అవకాశాలు ఇవ్వడంలో నాగ్ వెనుకడుగేయడు. సాల్మన్ చెప్పిన కథ నాగ్ కు సక్సెస్ అయితే తన సెంటిమెంట్ వర్కౌట్ అయినట్టే. ప్రస్తుతం తన ఫిట్ నెస్ నిలుపుకుంటూ యూవ హీరోలకు సవాల్ విసురుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: