తెలుగులో రచయిత, తెలుగుదేశం పార్టీ అభిమానురాలైన లక్ష్మీపార్వతి స్వర్గీయ నందమూరి తారక రామారావు ని వివాహం చేసుకున్న తర్వాత ఆమె పేరు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో మారుమోగింది.  మొదట తన భర్త వీరగంధం సుబ్బారావుతో కలిసి 1985లో ఎన్టీ రామారావు జీవితచరిత్ర రాయాలనే ఉద్దేశంతో ఆయనతో పరిచయం పెంచుకుంది.  ఆ పరిచయం వీరి మద్య సాన్నిహిత్యాన్ని పెంచింది. దాంతో వీరగంధం సుబ్బారావు నుంచి విడిపోయి ఎన్టీఆర్ ని వివాహం చేసుకుంది. 

 

అప్పట్లో రాజకీయ పరిస్థితు చాల క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. ఈమె రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్‌ను రెండోసారి ముఖ్యమంత్రిని చేయడంలో ఈమె పాత్ర ఎంతో కీలకం అని అంటారు. ఆ తర్వాత ఆమె ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్ అయ్యారు. అదే సమయంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో ఆమెకు విభేదాలు బాగా పెరిగిపోయాయి. ఇక ఎన్టీఆర్ మరణం  తర్వాత ఆమె రాజకీయాలకు పూర్తిగా దూరం అయిపోయారు. అప్పట్లో తనను మానసికంగా వేధిస్తున్నారని..మాజీ సీఎం చంద్రబాబు పై ఎన్నోసార్లు ఆరోపణలు చేశారు. 

 

జూనియర్ ఎన్టీఆర్ పై కూడా పలుమార్లు సంచలన ఆరోపణలు చేశారు లక్ష్మీ పార్వతి.  కొన్నేళ్ల క్రితం ఆమె వైసీపీ లో చేరారు. అప్పటి నుంచి క్రియాశీల రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు.  ప్రస్తుతం ఏపీ తెలుగు అకాడమీ ఛైర్మన్ వ్యవహరిస్తున్నారు లక్ష్మీ పార్వతి. ఇప్పటి వరకు ఆమెకు వెండి తెరతో ఎంతో పరిచం ఉన్నా..తెరపై మాత్రం కనిపించలేదు. తాజాగా 'రాధాకృష్ణ' అనే మూవీలో ఆమె నటిస్తున్నారు. 

 

ఈ మూవీకి సినీనటుడు శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఇటీవలే దర్శకుడిగా మారిన శ్రీనివాసరెడ్డి తాజాగా 'రాగల 24 గంటల్లో' అనే మూవీ రూపొందించారు. మహిళా ప్రధాన కథతో తెలంగాణ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో లక్ష్మీపార్వతి కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.  ఇప్పటి వరకు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన లక్ష్మీ పార్వతి ఇప్పుడు  వెండి తెరపై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో అని అనుకుంటున్నారు తెలుగు ప్రజలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: