ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో కి ఎంతో పాపులారిటీ ఉందో తెలిసిన విషయమే. జబర్దస్త్ షో ప్రసారమయ్యే రెండు రోజులు తెలుగు ప్రేక్షకులు అందరూ టీవీలకు అతుక్కుపోతారు. తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్ షో టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. అయితే గత కొంతకాలంగా జబర్దస్త్ షో కు సంబంధించి కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. జబర్దస్త్ జడ్జిగా ఉన్న మెగా బ్రదర్ నాగబాబు సహా ఇంకో ముగ్గురు ఫేమస్ టీం లీడర్లు జబర్దస్త్ వదిలి వెళ్ళిపోతున్నారు అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. అయితే జబర్దస్త్ ప్రేక్షకులు అందరూ ఈ వార్తలను నమ్మాలా వద్దా అనే అయోమయంలో ఉన్న సమయంలో ఇప్పటికే జబర్దస్త్ జడ్జిగా ఉన్న మెగా బ్రదర్ నాగబాబు తాను జబర్దస్త్  నుంచి తప్పుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా జబర్దస్త్ లో బాగా ఫేమస్ అయిన టీం లీడర్ చమ్మక్ చంద్ర కూడా జబర్దస్త్ జడ్జ్ నాగబాబు తో సహా తాను  కూడా తప్పుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చారు. కానీ తనకు లైఫ్ ఇచింది జబర్దస్త్ షో నే అంటూ  కృతజ్ఞతలు తెలిపారు చమ్మక్ చంద్ర. 

 


 అంతేకాదండోయ్ జబర్దస్త్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉండే  అనసూయ కూడా జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు ఓ వైపు వస్తుండగా మరోవైపు వీరందరూ వేరే ఛానల్ దర్శనమివ్వడం కూడా జబర్దస్త్ ప్రేక్షకులలో కాస్త అనుమానాలు రేకెత్తిస్తుంది. కాగా  జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి 7 ఏళ్లుగా జబర్దస్త్ లో జడ్జిగా కొనసాగిన మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ ప్రయాణం నిన్నటితో ముగిసిపోయిందని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా జబర్దస్త్ షో నుంచి త్వరలో రష్మీ కూడా బయటకు వెళ్లే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే టీం లీడర్స్ అందరితోపాటు హైపర్ ఆది కూడా జబర్దస్త్ నుంచి బయటకు వద్దామని అనుకున్నప్పటికీ కూడా లీగల్ సమస్యలు కారణంగా హైపర్ ఆది జబర్దస్త్ లో ఉండిపోవాల్సి వచ్చింది అంటూ వార్తలు వస్తున్నాయి.

 

 

 మొత్తానికి జబర్దస్త్ లో బాగా ఫేమస్ అయిన వాళ్ళు అందరు నిష్క్రమించడంతో చూస్తుంటే జబర్దస్త్ షో పరిస్థితి ఏంటో అన్నది ఆందోళనకరంగా మారినట్టు కనిపిస్తోంది. ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు అందరినీ కడుపుబ్బ నవ్వించిన జబర్దస్త్ షో నుండి  అందరు బయటకు వెళ్లడంతో షో  మూసివేస్తారు లేక కొత్త కమెడియన్స్ ను తెరమీదకి మీదికి తెచ్చి షోని  మరింత హైప్  చేస్తారా అన్నది కూడా ప్రస్తుతం జబర్దస్త్ ప్రేక్షకులందరికీ నెలకొన్న ప్రశ్న. అయితే జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి ఉన్న వీరందరూ సడన్గా తప్పుకోవడానికి గల కారణాలు ఏంటి అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అటు జబర్దస్త్ జడ్జిగా ఉన్న నాగబాబు కూడా తాను జబర్దస్త్ నుంచి తప్పుకుంటానని ఎప్పుడూ అనుకోలేదని కానీ తప్పుకోక తప్పడం లేదు అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: