రష్మిక మందన చలో అంటూ టాలీవుడ్లోకి అరంగేట్రం చేసిన ముద్దు గుమ్మ. ఆ మూవీలోనే కుర్ర కారు కళ్ళను తన వైపునకు తిప్పుకున్న రష్మికకు బ్రేక్ ఇచ్చిన మూవీగా గీతా గోవిందాన్ని చెపుకోవాలి. ఆ తరువాత ఆమె పేరు గీతగా మారిపోయింది. గీత యాటిట్యూడ్ కి  ఫుల్ గా యూత్ కనెక్ట్ అయిపోయారు. గీతా అంటూ  వెంటపడుతున్నారు. నిజంగా ఒక సినిమా టైటిల్ తో ఫ్యామస్ కావడం అంటే రష్మిక లక్కీ అనే చెప్పాలి.

 

ఇదిలా ఉండగా చాలా తక్కువ టైంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకునేందుకు రష్మిక దూకుడుగా ముందుకు సాగుతోంది. ఆమెకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన నటించే చాన్స్ రావడం ఒక గొప్ప  ఫీల్ .  ఇక ఈ మూవీని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్  రావిపూడి డైరెక్ట్ చేస్తున్నారు. అనిల్ ఇప్పటివరకూ తీసిన సినిమాలు అన్నీ కూడా హిట్లే. అలా తన గ్రాఫ్ ని పెంచుకుంటూ పోతున్న అనిల్ కి సంక్రాతి సెంటిమెంట్ బాగా ఉంది.

 

ఈ ఏడాది ఎఫ్ టు తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ 2020 ని సరిలేరు నీకెవ్వరు అంటున్నాడు. ఆ మూవీ గ్యారంటీగా టాప్ రేంజి హిట్ అన్నది కన్ ఫర్మ్ అయిపోయింది  టీజర్ చూసేసరికే. ఇక ఈ మూవీలో రష్మిక హీరోయిన్. దాంతో నక్కను తొక్కిన లక్కీ నీదే రష్మిక అంటున్నారంతా. ఈ మూవీ రష్మిక ఖాతాలో పెద్ద హిట్ అని రాసిపెట్టుకుంటోందిట.

 

ఇక ఈ మూవీ తరువాత అల్లు అర్జున్ తో సుక్కూ డైరెక్ష‌న్లో మరో మూవీకి కమిట్ అయిన రష్మిక భీష్మ‌ మూవీలో నితిన్ తో కలసి సరికొత్త రొమాన్స్ చూపిస్తోంది. మొత్తం మీద చూస్తుంటే 2020 యియర్ రష్మికదేనని అంటున్నారు. చలో చలో గీతా అంటున్నారు కూడా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: