అక్కినేని నాగార్జున వారసుడు నాగ చైతన్య జోష్ సినిమాతో తెరంగేట్రం చేశాడు. మొదటి సినిమా ఫ్లాప్ అయినా సెకండ్ సినిమా ఏమాయ చేసావే సినిమాతోనే చైతుకి సూపర్ హిట్ వచ్చింది. అయితే తనకు వచ్చిన లవర్ బోయ్ ఇమేజ్ కన్నా మాస్ ఫాలోయింగ్ కోసం ప్రయత్నించిన నాగ చైతన్య కెరియర్ లో వెనుకపడ్డాడు.

 

తనని ఎలాంటి సినిమాల్లో ఆడియెన్స్ చూడాలని అనుకుంటున్నారో మజిలీ హిట్ తో అర్ధమైన నాగ చైతన్య ఇక మీదట రిస్క్ చేయకుండా లవ్ స్టోరీస్ నే చేయాలని అనుకున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. కెరియర్ లో నాగ చైతన్యకు ఇది 19వ సినిమా అవడం విశేషం. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు లవ్ స్టోరీ అనే టైటిల్ పరిశీళణలో ఉంది.

 

ఇక ఈరోజు బర్త్ డే జరుపుకుంటున్న చైతు ఈ స్పెషల్ అకేషన్ సందర్భంగా శేఖర్ కమ్ముల సినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ వచ్చింది. ఈ సినిమా లో చైతు ఓ డ్యాన్స్ స్కూల్ నడిపించే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. మజిలీ సినిమా లుక్ లోనే చైతు ఈ సినిమాలో కూడా కనిపిస్తున్నాడు. తప్పకుండా నాగ చైతన్యకు ఈ సినిమా మంచి ఫలితాన్ని ఇచ్చేలా ఉంది. 

 

ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసి రెడీగా ఉన్న వెంకీమామ సినిమాతో కూడా చైతు మరో హిట్ తన ఖాతాలో వేసుకోఆలని చూస్తున్నాడు. వెంకటేష్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న నాగ చైతన్య వెంకీమామ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. మజిలీ హిట్ చైతు కెరియర్ సెట్ రైట్ చేయగా ఇక మీద అలాంటి సినిమాలతోనే ప్రేక్షకులను అలరించాలని నిర్ణయించుకున్నాడు నాగ చైతన్య. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల సాయి పల్లవి కాంబోలో వస్తున్న ఈ సినిమా ఆవిధంగా కూడా పక్కా హిట్ అనేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: