టాలీవుడ్ లో తనదైన కామెడీ మార్క్ చాటుకుంటూ సక్సెస్ సినిమాలతో దూసుకు పోతున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి.  టాలీవుడ్ లో తెలుగు ప్రేక్షకులు హాస్యానికి పెద్ద పీట వేస్తారు. అందుకే ఏ సినిమా అయినా సరె కామెడీ లేకుండా వర్క్ ఔట్ చేయలేరు. ప్రస్తుతం అనీల్ రావిపూడి - సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ తెరకెక్కించారు.  ఈ మూవీకి సంబంధించిన టీజర్ నిన్న రిలీజ్ చేశారు.  తాజాగా ఈ మూవీ విశేషాలు దర్శకుడు అనీల్ రావిపూడి పంచుకున్నారు.

 

ఎఫ్-2 షూటింగ్ జరుగుతున్న సమయంలోనే మహేష్‌బాబుకు ఈ కథ వినిపించాను. సింగిల్‌సిట్టింగ్‌లోనే ఆయన ఓకేచేశారు అని అన్నారు అనిల్‌రావిపూడి. మహేష్‌బాబుతో సినిమా చేయాలని అనుకున్నప్పుడు కెరీర్‌లో ఇప్పటివరకు ఆయన టచ్ చేయని పాత్ర, బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకుంటే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. మేజర్ అజయ్‌కృష్ణ అనే ఆర్మీ అధికారిగా మహేష్‌బాబు కనిపిస్తారు. అయితే ఈ కథ ఎలా పుట్టిందన్న విషయం గురించి ప్రస్తావిస్తూ..సుప్రీమ్ సినిమా సమయంలో జోధ్‌పూర్ నుంచి ట్రైన్‌లో వస్తున్నప్పుడు ఓ సైనికుడు పరిచయమయ్యారు. చాలా సెన్సాఫ్‌హ్యూమర్‌తో సరదాగా మాట్లాడాడు.

 

నిజంగా దేశం కోసం ప్రాలు అర్పించే సైనికులు ఎంతో కఠినంగా ఉంటారని విన్నాను..కానీ ఆ సైనికున్ని చూస్తుంటే ఇంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారా అనిపించింది.  సోల్జర్స్ ఎందుకిలా ఉండకూడదనే ఆలోచన నుంచి ఈ కథ పుట్టింది. సమాజం కోసం ఓ ఆర్మీ అధికారి ఏం చేశాడన్నది ఆకట్టుకుంటుంది. 45 నిమిషాలు కథ వినగానే మనం ఈ సినిమా చేస్తున్నామని మహేష్ అన్నారు. ఈ మూవీలో ఇప్పటి వరకు చూడని మహేష్ బాబుని చూస్తారు..ఆయన సెన్సాఫ్ హ్యూమర్ ఎలా ఉంటుందో తెలరపై చూస్తే తెలుస్తుంది.

 

హీరో క్యారెక్టరైజేషన్ ఆయనకు చాలా నచ్చింది. దర్శకులకు ముందుగానే కంఫర్ట్‌జోన్‌ను సృష్టిస్తుంటారాయన. ప్రొఫెసర్ భారతిగా ఆమె పాత్ర శక్తివంతంగా ఉంటుంది. మహేష్‌బాబుతో ఆమె కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ పాత్రలో ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేకపోయాను.  ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరూ షభాష్ అని అంటారని అనీల్ రావిపూడి నమ్మకం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: