మహేష్ బాబు తను టాప్ హీరోగా ఎంత బిజీగా కొనసాగుతూ ఉన్నా తన సినిమా సినిమాకు మధ్య ఏర్పడే గ్యాప్ లో తన భార్య పిల్లలను విదేశాలకు తీసుకు వెళ్ళి హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేయడం ఒక అలవాటుగా పెట్టుకున్నాడు. ఇప్పుడు నాగచైతన్య సమంతలు కూడ అదే పద్ధతిని అనుసరిస్తున్నారు. 

ఈరోజు చైతన్య తన పుట్టినరోజును సమంతతో కలిసి యూరప్ లోని ఒక హాలిడే స్పాట్ లో సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. వీరిద్దరూ తమ హాలిడే ట్రిప్ ను ముగించుకుని డిసెంబర్ 3న ఇండియాకు తిరిగి రాబోతున్నారు. చైతన్య పుట్టినరోజు సందర్భంగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో అతడు నటిస్తున్న లేటెస్ట్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు అతడి లుక్ కు సంబంధించ స్పెషల్ గ్లింప్స్ ను కూడ విడుదల చేసారు. 

ఈ మూవీకి సంబంధించి చైతన్య తన లుక్ ను పూర్తిగా మార్చుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. మునుపటితో పోలిస్తే షార్ట్ హెయిర్ గుబురు గడ్డంతో పాటు ఫేస్ లో వైబ్రేంట్ గా కనిపిస్తున్న ఆ నవ్వుతో చైతన్యలో ఒక కొత్త లుక్ కనిపిస్తోంది.  వాస్తవానికి ఈ సినిమాకు లవ్ స్టోరీ అన్న టైటిల్ పెడతారు అంటూ లీకులు వచ్చినా ఆ టైటిల్ ఫిక్స్ కాలేదు. 

దీనితో దర్శకుడు శేఖర్ కమ్ముల మనసులో ఎదో ఒక కొత్త టైటిల్ ఆలోచనలలో ఉంది అన్న సందేహాలు వస్తున్నాయి. ఈ మూవీలో సాయి పల్లవి చైతన్యలతో పాటు కొందరు చిన్న పిల్లలు కూడ నటిస్తున్నారు. దీనితో చైతు ‘మజిలీ’ తర్వాత మరో ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్నాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అయితే శేఖర్ కమ్ముల ఏరికోరి చైతూ సాయి పల్లవిల కాంబినేషన్ సెట్ చేయడంతో ఫిబ్రవరిలో రాబోతున్న ఈ మూవీ చైతన్య కెరియర్ ను మరోస్థాయికి తీసుకువెడుతుంది అన్న అంచనాలు ఉన్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: