తను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను అని పంచ్ డైలాగులు చెప్పి ప్రస్తుతం టాలీవుడ్ ఎంపరర్ గా మారిపోయిన పవన్ కళ్యాణ్ పై ఒక ఆశక్తికర చర్చ ప్రస్తుతం పవన్ అభిమానులలో జరుగుతోంది. హీరోల మధ్య పోటీ మరీ పెరిగిపోవడంతో ప్రస్తుతం టాప్ హీరోలంతా తమ నటనతో పాటు తమ ఫిజిక్ పై కూడా దృష్టి పెట్టి మారుతున్న పరిస్థుతులకు అనుగుణంగా విదేశాల నుండి ఫిజికల్ ట్రైనర్ లను లక్షలు ఖర్చు పెట్టి తెప్పించుకుని తమ బాడీని సినిమా కధకు, సన్నివేశాలకు అనుగుణంగా సిక్స్ ప్యాక్ బాడీలుగా మార్చుకుంటున్నారు.  ఇంతవరకు చాల సినిమాలలో నటించిన మహేష్ ఏనాడు తన షర్టు విప్పి కెమెరా ముందుకు రాకపోయినా పెరిగి పోతున్న పోటీని దృష్టిలో పెట్టుకుని రాబోతున్న ‘వన్’ సినిమాలో తన సిక్స్ ప్యాక్ బాడీని చూపెట్టబోతున్నాడు. మహేష్ తో పాటు రామ్ చరణ్, జూనియర్, అల్లుఅర్జున్, ప్రభాస్. నితిన్ లాంటి యంగ్ హీరోలు అంతా సిక్స్ ప్యాక్ బాడీ మెయిన్ టైన్ చేస్తూ ఉంటే ప్రస్తుతం టాప్ యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్న పవన్ కూడా రాబోతున్న సినిమాలలో తన సిక్స్ ప్యాక్ అవతారాన్ని చూపెట్టి తాను కూడా ఈ విషయంలో నెంబర్ వన్ అని నిరూపించుకుంటాడ అనే ఆశక్తికర చర్చ జరుగుతోంది.  కానీ అటువంటి అవసరం తాను నటించే సినిమా పాత్రల ద్వారా ఏర్పడితే మిగతాన్ హీరోలులా కాకుండా 8 ప్యాక్ [ఎనిమిది పలకలదేహం] లుక్ తో కనిపించి తాను మిగతా హీరోల కన్నా ఈ విషయంలో కూడా నెంబర్ వన్ అనిపించుకుంటాడని పవన్ అభిమానుల వాదన. ఏది ఏమైనా రాబోతున్న కొత్త పవన్ సినిమాలలో పవన్ ఫిజిక్ లో కూడా మార్పులు ఉండటం ఖాయం అని అంటున్నారు పవన్ అభిమానులు. తన అభిమానుల కోరిక పవన్ దృష్టిలో పడితే పవన్ ఈ విషయంలో కూడా యంగ్ హీరోలకు సవాల్ విసిరే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: