సౌత్ లో క్రేజీ బ్యూటీగా.. స్టార్ హీరోయిన్ గా ఫాలోయింగ్ ఏర్పరచుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో ఓ చిన్న సినిమాతో కెరియర్ ప్రారంభించినా అమ్మడి టాలెంట్ తో స్టార్ ఛాన్సులు అందుకుంది. తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో కలిసి నటించిన రకుల్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో పెద్దగా అవకాశాలు లేకపోయినా బాలీవుడ్ లో ఛాన్సులు అందుకుంటుంది.

 

బాలీవుడ్ ఆడియెన్స్ కు నచ్చేస్తే ఇక కెరియర్ కు ఢోకా ఉండదని భావిస్తున్న రకుల్ అక్కడ ఆడియెన్స్ కోసం ఏమాత్రం ఆలోచించకుండా అందాల ప్రదర్శన చేస్తుంది. అజయ్ దేవగన్ తో చేసిన దే దే ప్యార్ దే సినిమాలో అమ్మడి హాట్ షోకి బాలీవుడ్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. రీసెంట్ గా సిద్ధార్థ్ మల్ హోత్రా సినిమాలో కూడా హాట్ ఐటం సాంగ్ తో మెప్పించింది రకుల్.

 

ఇక లేటెస్ట్ గా ఈ అమ్మడు బెంగళూరులో 6 కోట్లతో ఓ ఇల్లు కొన్నదట. ఆల్రెడీ హైదరాబాద్ లో రెండేళ్ల క్రితమే ఇల్లు కొనేసిన రకుల్ ఇక్కడ ఓ జిం కూడా మెయింటైన్ చేస్తుంది. అప్పుడే రకుల్ కు ఒక స్టార్ హీరో హైదరాబాద్ లో ఇల్లు కొనిచ్చాడని వార్తలు రాగా దానికి ఆమె అది తన సొంత డబ్బులతో కొన్నదే ఎవరు గిఫ్ట్ గా ఇవ్వలేదని ఫైర్ అయ్యింది. ఇప్పుడు రకుల్ బెంగుళూరులో ఇల్లు కొన్నది అంటే అక్కడ కూడా తన జిం పెట్టేలా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో జోరు తగ్గినట్టు కనిపిస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం హింది సినిమాల మీద దృష్టి పెట్టింది.   

 

ఈమధ్య కన్నడ మూవీ ఛాన్స్ వచ్చినట్టు కూడా ఉంది. అందుకే బెంగుళూరులో ఇల్లు కొనేసింది. మరి అమ్మడికి చెన్నై నచ్చలేదా తమిళంలో సినిమాలు వచ్చినా ఎందుకు చెన్నైలో రకుల్ ఇల్లు కొనలేదో అని డౌట్ పడుతున్నారు ఆమె ఫ్యాన్స్. మన్మథుడు 2 తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు అందుకోని రకుల్ కమర్షియల్ సినిమాలే కాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు సై అంటుంది.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: