వరుస విజయాలతో దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు... హీరోలందరికీ తన సినిమాలతో హిట్లను  అందిస్తున్న సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. అయితే హిట్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక  తాజాగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు టీజర్ లో ప్రేక్షకులకు ఎంటర్టెన్మెంట్ పంచటంలో  ఎలాంటి బేరాల్లేవమ్మా అనేట్టుగా ఉంది  సరిలేరు నీకెవ్వరు టీజర్. ఓ వైపు దర్శకుడు సూపర్ హిట్ దర్శకుడు...  మరోవైపు సూపర్ హీరో కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్  హిట్ కొట్టడం ఖాయమని మహేష్ బాబు అభిమానులు ధీమాతో ఉన్నారు. నిన్న విడుదలైన ఈ సినిమా టీజర్ యూట్యూబ్ ని షేక్ చేసేస్తుంది. రికార్డులు సృష్టిస్తూ దుమ్ము లేపుతు  దూసుకుపోతోంది సరిలేరు నీకెవ్వరు టీజర్. అయితే సరిలేరు నీకెవ్వరు టీజర్ విడుదల అయినా 9 నిమిషాల్లోనే వన్ మిలియన్ రియల్ టైం వ్యూస్  సంపాదించి  రికార్డ్ సృష్టించింది. అంతేకాకుండా 18 నిమిషాల్లోనే 100క్ వ్యూస్  సాధించిన తొలి టీజర్ గా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు టీజర్ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు టీజర్ 1.2 కోట్ల రియల్ టైం కి వ్యూస్ తో  ఇండియాలోనే మొదటి ట్రేండింగ్  స్థానంలో ఉంది. 

 


 ఇదిలా ఉండగా గత కొన్ని సినిమాల నుంచి విభిన్నమైన కథలు ఎంచుకుంటూ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. సినిమా సినిమాకి సంబంధం లేకుండా విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకుపోతున్నారు  సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక అటు దర్శకుడు అనిల్ రావిపూడి కూడా చేసిన మూడు సినిమాలలో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. పటాస్,  రాజా ది గ్రేట్,  ఎఫ్ 2 సినిమాలతో  బాక్సాఫీస్ ని ఓ రేంజ్ లో షేక్  చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అయితే ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో సీనియర్ హీరో వెంకటేష్ యంగ్  హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్లో ఎఫ్ 2 చిత్రాన్ని తెరకెక్కించిన అనిల్ రావిపూడి... ఈ సంవత్సరం సంక్రాంతికి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమా తెరకెక్కిస్తు వచ్చే సంక్రాంతికి కూడా ప్రేక్షకులకు సినీ విందు  తయారు చేస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. 

 


 అయితే నిన్న విడుదలైన సరిలేరు నీకెవ్వరు టీజర్ లో అనిల్ రావిపూడి మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అనిల్ రావిపూడి సినిమాలంటే ఎంటర్టెన్మెంట్ గ్యారంటీ అన్నట్లుగా  ఉంటుంది.తాజా టీజర్ లో కూడా  ఓ వైపు ఎమోషన్స్ మరోవైపు కామెడీ ఇంకోవైపు ఆక్షన్ ఇలా మూడు సమపాళ్ళలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే అప్పుటి  సినిమాలు సత్తా ఏంటో నిరూపించి ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ క్రియాశీలక పాత్ర పోషించి  పదమూడేళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న  విజయశాంతి నటన ను చూసేందుకు కూడా అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా సరిలేరు నీకెవ్వరు టీజర్ లో విజయశాంతి లుక్ చూస్తుంటే అదే  పట్టుదల అదే రాజసం అదే పౌరుషం కనిపిస్తోంది. విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ  ఇస్తుండడం కూడా ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేయడానికి దోహాద  పడుతుందని సినీ ప్రేక్షకులు భావిస్తున్నారు . అయితే టీజర్ తోనే రికార్డులు సృష్టిస్తున్న మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా మరిన్ని  రికార్డులు సృష్టించబోతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: