టాలీవుడ్ లో కొంత కాలంగా కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని ఎన్నో విమర్శలు వస్తున్నాయి.  ఇక కాస్టింగ్ కౌచ్ అనగానే నటి శ్రీరెడ్డి గుర్తుకు వస్తుంది.  తెలుగు లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని..ఎంతో మంది అమాయక అమ్మాయిలు కొంత మంది దళారుల చేతుల్లో పడి దారుణంగా మోసపోతున్నారని శ్రీరెడ్డి ఆరోపణ. తాను కూడా కొంత మంది సెలబ్రెటీల చేతుల్లో మోసపోయానని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.  బాలీవుడ్ లో మీ టూ ఉద్యమం నేపథ్యంలో తనూ శ్రీ దత్త, కంగనా రౌనత్ లాంటి వారు గతంలో తమపై జరిగిన లైంగి వేధింపులపై గళమెత్తారు.  

 

ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లు తమపై జరిగిన లైంగిక వేధింపులు, దాడుల గురించి చెప్పారు.  తాజాగా నటి మంజరి ఫడ్నిస్ తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టింది. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందని..దానికి ఎంతో మంది అమ్మాయిలు బలి అవుతున్నారని..పడక సుఖం అందిస్తే పర్ఫామెన్స్ ఛాన్స్ లేదంటా బయటకే పరిమితం అంటూ ఆరోపించింది.  తన కెరీర్ లో చాలా వరకు చిన్న సినిమాల్లోనే నటించేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. అవి బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవ్వడం, కాస్టింగ్ కౌచ్ వంటి విషయాల వలన చాలా కాలం డిప్రెషన్ లో ఉండిపోయానని చెప్పింది.

 

 తాను పడక సుఖం ఇవ్వకపోవడం వల్లనే భారీ బడ్జెట్ సినిమాల్లో నటించలేక పోయానని ఆవేదన వ్యక్తం చేసింది. కాస్టింగ్ కౌచ్ విషయంలో ఆత్మాభిమానా న్ని కోల్పోలేక ఎందరో నిర్మాతల సినిమాలను రిజెక్ట్ చేసినట్లు చెప్పుకొచ్చింది.  కొన్ని సార్లు సినిమాకి సైన్ చేసిన తరువాత కోరికలు తీర్చమని అడిగేవారని.. దీంతో అడ్వాన్స్ గా తీసుకున్న డబ్బుని తిరిగిచ్చేసి సినిమాల నుండి తప్పుకున్నట్లు తెలిపింది.  అవకాశాల కోసం సెక్స్ కి ఒప్పుకునే అమ్మాయిని కాదని ఇండస్ట్రీలో చాలా మందికి తెలిసే ఉంటుందని.. అందుకే తనకు అవకాశాలు రావడం లేదని సంచలన కామెంట్స్ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: