సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా టీజర్ శుక్రవారం సాయంత్రం రిలీజైంది. మహేష్ స్టామినాకు తగినట్టుగా సరిలేరు నీకెవ్వరు తెరకెక్కుతుందని టీజర్ చూస్తేనే తెలుస్తుంది. ముఖ్యంగా అనీల్ రావిపుడి డైలాగ్స్ సినిమాకు హైలెట్ గా నిలిచేలా ఉన్నాయి.

 

సినిమా టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఫాస్ట్ 10 మిలియన్ వ్యూస్ సాధించిన తెలుగు సినిమా టీజర్ గా సరిలేరు మూవీ ఓ సరికొత్త రికార్డ్ సృష్టించింది. టీజర్ లో విలన్ గా ప్రకాశ్ రాజ్, స్పెషల్ రోల్ లో విజయశాంతి ఇలా అందరు సర్ ప్రైజ్ చేశారు. అయితే ఎటొచ్చి టీజర్ లో హీరోయిన్ కనబడలేదు అన్నదే డిజప్పాయింట్ గా అనిపించింది.

 

తెలుగులో అతి తక్కువ కాలంలోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రష్మిక మందన్న మహేష్ తో మొదటిసారి జత కడుతుంది. ఈ సినిమా తర్వాత రష్మిక రేంజ్ తప్పకుండా మారుతుంది. అయితే సరిలేరు నీకెవ్వరు టీజర్ లో రష్మికకు ఛాన్స్ ఇవ్వలేదు చిత్రయూనిట్. అందుకు రష్మిక ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.. అయితే ఈ విషయం తెలుసుకున్న సరిలేరు టీం రష్మిక కోసం ఓ స్పెషల్ టీజర్ కట్ చేస్తున్నారట.

 

అది కూడా త్వరలోనే వస్తుందని తెలుస్తుంది. సరిలేరు నీకెవ్వరు అసలైతే జనవరి 12న రిలీజ్ అన్నారు కాని టీజర్ లో డేట్ ఎనౌన్స్ చేయలేదు. పోటీగా వస్తున్న అల వైకుంఠపురములో సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడన్నది చూసి మహేష్ సినిమా రిలీజ్ ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇరు చిత్ర దర్శక నిర్మాతలు చర్చించుకుని ఓ నిర్ణయానికి వస్తున్నట్టు తెలుస్తుంది. టీజర్ లో డైలాగ్ తో తనే సంక్రాంతికి బాక్సాఫీస్ మొగుడునవుతానని ఇన్ డైరక్ట్ గా చెప్పిన మహేష్ సరిలేరు నీకెవ్వరుతో ఏ రేంజ్ లో సత్తా చాటుతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: