సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం "సరిలేరు నీకెవ్వరు". సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో  లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటిస్తుంది. అయితే ఈ సినిమా టీజర్ నిన్ననే రిలీజ్ అయింది. విడుదల అయిన కొద్దిసేపట్లోనే మిలియన్ల వ్యూస్ చేరుకుని ట్రెండింగ్ లోకి వచ్చింది.

 

టీజర్ సినిమా మీద అంచనాలను మరింత రెట్టింపు చేసింది. ప్రేక్షకులు ఎదురుచూసినందుకు టీజర్ ఏ మాత్రం నిరుత్సాహ పరచలేదు. మహేష్ బాబు లుక్, పలికే డైలాగులు నేపథ్య సంగీతం  బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆర్మీ ఆఫీసరుగా మహేష్ చాలా బాగున్నాడు. అనిల్ రావిపూడి సినిమాలంటే వినోదం ఖచ్చితంగా ఉంటుందని అందరికీ తెలుసు. దీంట్లో కూడా కామెడీ పాళ్ళు ఎక్కువ ఉన్నాయని అనిపిస్తుంది.

 

అది మహేష్ చెప్పే డైలాగుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు సరిలేరు నీకెవ్వరు సినిమా నుండి ఒక్క పాట కూడా విడుదల కాలేదు. సినిమా విడుదలకు తక్కువ సమయం మాత్రమే ఉంది. ఇప్పటి నుండి ప్రమోషన్ చేస్తేనే సినిమాకి ఓపెనింగ్స్ వస్తాయి.  ప్రస్తుతానికి టీజర్ కి మంచి స్పందనే వచ్చింది. కానీ ఈ హైప్ ని అలాగే కొనసాగించాలంటే సమయం చూసుకుని పాటలని వదలాల్సి ఉంటుంది.

 

ఈ విషయంలో పోటీ సినిమా వాళ్ళు ఒక అడుగు ముందున్నారనే చెప్పాలి. సరిలేరు టీం నుండి కూడా అలాంటి ప్రమోషన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే సంక్రాంతికి చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. విడుదలయ్యే అన్ని సినిమాలలో కెల్లా టాప్ గా నిలవాలంటే ప్రమోషన్ ని పెంచాలి. అందుకని సినిమాలోని పాటలు రిలీజ్ చేయడం సరైన పద్దతని అంటున్నారు. మరి సరిలేరు నుండి పాటలు ఎప్పుడు విడుదలవుతాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: