ఈ మద్య సినీ సెలబ్రెటీలు ఎక్కువగా డేటింగ్ కల్చర్ ఫాలో అవుతున్న విషయం తెలిసిందే.  ఒకప్పుడు పాశ్చాత్య నాగరికత అయిన ఈ డేటింగ్ (సహజీవనం) కల్చర్ ఇప్పుడు ఇండియాలో కూడా మొదలైంది.  సినీ సెలబ్రెటీలే కాదు సామాన్యులకు సైతం ఆ జాఢ్యం మొదలైంది.  పెళ్లికి ముందే ఒకరినొకరు ఇష్టపడం..కొంత కాలం కలిసి ఉండటం..ఇష్టమైతే పెళ్లి చేసుకోవడం లేదంటే విడిపోవడం కామన్ అయ్యింది.  ఈ సమయంలో వారు భార్యాభర్తల్లా కలిసి ఉండటం జరుగుతుంది. అయితే డేటింగ్ కల్చర్ పై చాలా మంది హీరోయిన్లు బాహాటంగానే మాట్లాడారు. 

 

 ఆ మద్య సంచలన తార రాధికా ఆప్టే డేటింగ్ చేయడం పెద్ద తప్పు కాదని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసింది.  ఆమె తర్వాత పలువురు నటీ,నటులు వాధించారు.  అయితే డేటింగ్ విధానంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని..ఈ కల్చర్ వల్ల యువత పెడదోవ పడుతుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగశౌర్య నటించిన  `ఊహాలు గుస‌గుస‌లాడే` మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది రాశీఖన్నా. 

 

తెలుగు లో మంచి విజయాలు అందుకూంటున్న సమయంలో 'ఇమైకా నొడిగళ్‌','అడంగమరు', 'అయోగ్య ' లాంటి కోలీవుడ్ మూవీస్ లో తన సత్తా చాటింది. తాజాగా ఈ మద్య విజయ్ సేతుపతితో కలిసి నటించిన 'సంఘతమిళన్‌' అనే సినిమా తో మరో విజయం అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తాను ఎవరి ప్రేమలో అయినా ఉన్నారా..ఎవరితై అయినా డేటింగ్ చేస్తున్నారా అన్న ప్రశ్నలు వేస్తుంటారని..అయితే తాను 16వ ఏటలోనే ఓ అబ్బాయితో డేటింగ్ చేశానని చెప్పింది. ఆ కుర్రాడి వయసు కూడా అప్పుడు 16 ఏళ్లేనని చెప్పుకొచ్చింది.

 

  సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందని..తనను కూడా కొంత మంది రక రకాలుగా కోరికలు తీర్చాలని ప్రపోజల్స్ ఇన్ డైరెక్ట్ గా తీసుకు వచ్చారని..కానీ తాను మాత్రం ఎవ్వరికీ లొంగలేదని చెప్పింది. ప్రస్తుతం తను కమర్షియల్ కథా పాత్రల్లో నటిస్తున్నట్లు, మంచి సామాజిక బాధ్యత కలిగిన పాత్రల్లో నటించాలనేది తన కోరిక అని చెప్పుకొచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: