కోలీవుడ్ లో జయలలిత బయోపిక్ గా వస్తున్న సినిమా తలైవి. విజయ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో జయలిత పాత్రలో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తుంది. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. తలైవిగా కంగనా లుక్ అద్భుతం అని చెప్పొచ్చు.

 

జయలలిత పాత్ర కోసం కంగనా తనని తాను మార్చుకున్న తీరు అద్భుతం. సిని నటిగానే కాదు రాజకీయ శక్తిగా.. తమిళ ప్రజలందరికి అమ్మగా వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన జయలలిత జీవిత కథతో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా కోసం కంగనా చాలా కష్టపడుతుందని తెలుస్తుంది. ఫస్ట్ లుక్ టీజర్ చూశాక సినిమా కోసం కంగనా ఎంత ప్యాషనెట్ గా ఉందో అర్ధమవుతుంది.

 

అయితే జయలలిత జీవిత కథతో తమిళ్ లోనే మరో సినిమా వస్తుంది. ఆ సినిమాలో జయలలిత పాత్రలో నిత్యా మీనన్ నటిస్తుంది. ఆ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ అప్పట్లో రిలీజైంది. అయ్తిఏ నిత్యా మీనన్ కన్నా జయలలితగా కంగనానే చాలా బాగుందని చెప్పొచ్చు. ఇక టీజర్ లో ఓ డ్యాన్స్ సీన్ తో పాటుగా ఓ పొలిటికల్ మీటింగ్ లో ప్రజలకు అభివాదం చేస్తున్నట్టుగా చూపించారు.

 

ఆ అభివాదం చేస్తున్న సీన్ చూస్తే నిజంగా అది జయలైతనే అనేలా కళ్లు మనల్ని మోసం చేసేలా దర్శకుడి మ్యాజిక్ కనిపిస్తుంది. తప్పకుండా ఈ సినిమా మహానటిలానే సూపర్ హిట్ మూవీ అవుతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడ ముగిస్తారు.. క్లైమాక్స్ లో అమ్మ మరణం ఎలా చూపిస్తారు అన్న విషయంపై తమిళ ఆడియెన్స్ లో క్యూరియాసిటీ ఏర్పడింది. మహానటి లానే ఈ సినిమా కూడా ప్రేక్షక హృదయాలను గెలిచేలా ఉంటుందని అనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: