తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. కొత్త సినిమాలకు, దర్శకులకు, నటులకు ఆయన భరోసా ఇస్తే వారి ఆనందమే వేరు. పైగా.. మెగా ఫ్యాన్స్ అండదండలు కూడా వాళ్ల సినిమాలకు ప్లస్ అవుతుంది. ముఖ్యంగా సినిమా జనాల్లోకి త్వరగా వెళుతుంది. యంగ్ జనరేషన్ హీరో నిఖిల్.. తాను నటించిన అర్జున్ సురవరం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించాడు.

 

 

ఈనెల 26న ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్ కు చిరంజీవికి తెలంగాణ  పోలీసులు పర్మిషన్ ఇస్తారా.. లేదా అనేదే ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే.. అర్జున్ సురవరం ప్రీరిలీజ్ ఈవెంట్ జరిపే ప్రదేశం నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో. ఇదే ప్రదేశంలో రీసెంట్ గా జార్జి రెడ్డి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ ను ఆహ్వానించారు మేకర్స్. అయితే అభిమాన జనసందోహం తో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయని పోలీసులు పవన్ కు పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడదే ప్రాంతంలో మెగాస్టార్ తో ఫంక్షన్ ఏర్పాటు చేశాడు నిఖిల్. దీంతో ఇప్పుడు ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. క్రేజ్ పరంగా చూస్తూ చిరంజీవి ఎవర్ గ్రీన్ టాప్. అయితే జనరేషన్ దృష్ట్యా పవన్ కల్యాణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ యూత్ లో పీక్స్ లో ఉంది. ఆయనను ఫాలో అయ్యేవారి సంఖ్య అనూహ్యం.

 

 

చిరంజీవి అభిమానులే పవన్ కు కూడా అభిమానులుగా ఉన్నారు. వయసు దృష్ట్యా ఇండస్ట్రీకి పెద్దగా కూడా ఉన్నాడు చిరంజీవి. అభిమానులు కూడా భారీగా వస్తారు. చిరంజీవి రాక తమకు ఉపయోగపడుతుందని వారి ఆశ. మరి.. తమ్ముడికి ఇవ్వని పర్మిషన్ అన్నయ్యకు పోలీసు శాఖ ఇస్తుందేమో చూడాలి. ఈనెల 29న ఈ సినిమా విడుదల కానుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: