అక్కినేని ఫ్యామిలీ నుంచి మహానటులు నాగేశ్వరరావు తర్వాత అక్కినేని నాగార్జున హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు.  ఆయన వారసులుగా ‘జోష్ ’ మూవీతో అక్కినేని నాగ చైతన్య హీరోగా పరిచయం అయ్యాడు.  ఆ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏం మాయ చేసావే’ మూవీతో మంచి విజయం అందుకున్నాడు.  ఈ మూవీలో నటించిన తన సహనటి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.  అయితే నాగచైతన్య వివాహం తర్వాత నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నటికీ సమంత-చైతూ జంటగా నటించిన ‘మజిలీ’ సూపర్ హిట్ అందుకుంది.  చై-సామ్‌లు పెళ్లైన తరువాత మొదటి సారి కలిసి నటించిన ఈ సూపర్ హిట్ కావడంతో మరోసారి లక్కీ పెయిర్ అని నిరూపించుకున్నారు. ఈ మూవీలో చైతూ రా లుక్‌కు మంచి స్పందన వచ్చింది. 

 

మూవీ తర్వాత విక్టరీ వెంకటేష్ తో కలిసి బాబీ దర్శకత్వంలో ‘వెంకిమామ’ మూవీలో నటిస్తున్నాడు. అయితే నిజ జీవితంలో వెంకటేష్..చైతూకి మేన మామ కావడం మరో విశేషం. ఈ మూవీ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.  సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఓ టీజర్ కొద్ది సేపటి క్రితం రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.   శేఖర్ కమ్ముల సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రలతోనే మూవీస్ తెరకెక్కిస్తారన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో నాగ చైతన్య లుక్ విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు డైరెక్టర్.

 

తన ప్రపంచంలోకి ఆయన బర్త్ డే సందర్భంగా మనల్ని అహ్వానిస్తున్నాడు చైతు. ఈ టీజర్ చూస్తుంటే నిజంగా గుండెకు హత్తుకునేలా ఉంది.  ఇందులో నాగచైతన్య చీపురు పట్టి ఊడుస్తూ, డబ్బులు జాగ్రత్త చేస్తూ ఇలా మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన వ్యక్తి పాత్రలో కనిపించాడు.  సహజత్వం నింపుకొన్న ఉన్న పాత్రలతో అందమైన కథలను తెర మీద కు తెచ్చే శేఖర్ కమ్ముల ఈ ప్రేమ కథను మరింత హృద్యంగా మలుచుతున్నాడు. మొత్తానికి ఈ మూవీతో మరో విజయాన్ని ఖచ్చితంగా అందుకుంటాడని అంటున్నారు చైతూ ఫ్యాన్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి: