సూపర్ స్టార్ మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో టాలీవుడ్ లో హీరోగా కెరీర్ మొదలుపెట్టాడు. కెరీర్ మొదట్లో మహేష్ బాబు నటించిన సినిమాలు భారీగా విజయాలు సాధించలేదు. మురారి సినిమాతో మహేష్ బాబు ఖాతాలో భారీ విజయం నమోదైంది. ఆ తరువాత మహేష్ నటించిన ఒక్కడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు మహేష్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. 
 
త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన అతడు సినిమా ఇప్పటికీ రికార్డు స్థాయి టీఆర్పీలు బుల్లి తెర మీద సాధించడం గమనార్హం. అతడు తరువాత మహేష్ నటించిన పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. 12 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన పోకిరి సినిమా 40 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు సాధించింది. ఇటు మహేష్ బాబు కెరీర్లో, అటు పూరీ జగన్నాథ్ కెరీర్లో పోకిరి సినిమా మరపురాని చిత్రంగా నిలిచింది. 
 
పోకిరి సినిమా తరువాత మహేష్ బాబు నటించిన సినిమాలు ఎక్కువగా ఫ్లాప్ అయ్యాయి. 2011 సంవత్సరంలో మహేష్ బాబు శ్రీనువైట్ల కాంబినేషన్లో తెరకెక్కిన దూకుడు సినిమా ఘన విజయం సాధించింది. దూకుడు తరువాత మహేష్ నటించిన బిజినెస్ మేన్ సినిమా కూడా హిట్ అయింది. వెంకటేష్ - మహేష్ బాబు కాంబినేషన్లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు హిట్ అయింది. 
 
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తరువాత మహేష్ నటించిన సినిమాలు హిట్ కాలేదు. మహేశ్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మహేశ్ కొరటాల కాంబినేషన్లో తెరకెక్కిన మరో సినిమా భరత్ అనే నేను సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. భరత్ అనే నేను తరువాత మహేష్ హీరోగావంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టైంది. ప్రస్తుతం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నాడు. 2020 సంవత్సరం జనవరి 11వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: