సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలంటే ఖచ్చితంగా కమిట్‌మెంట్ అంటే పక్క పంచుకోవాల్సిందేనని మరోసారి బయటపడింది. మీటూ పుణ్యమా అని ఎందరో హీరోయిన్లు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా బయటపెట్టగలిగారు. తీగ లాగితే నెమ్మదిగా డొంక మొత్తం కదులుతోంది. ఈ డొంకలో వరుసగా మంచి సక్సస్ ఫుల్ హీరోయిన్సే బయటకు వస్తున్నారు. తాజాగా ప్రముఖ నటి మంజరి ఫడ్నిస్ తను ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ గురించి వెల్లడించింది. 

15 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నాను. ఇంత లాంగ్ కెరీర్ ఉన్నప్పటికీ నేను చేసిన సినిమాల కంటే పోగొట్టుకున్న సినిమాలే ఎక్కువ. ఇందుకు కారణం ఆ సినిమా డైరెక్టర్‌కో ప్రొడ్యూసర్‌కో పడకగది సుఖం ఇవ్వకపోవడం. వాళ్లు అడిగిన దానికి ఒప్పుకోలేదని నన్ను సినిమాల నుంచి అప్పటికపూడే తీసేసేవారు. అంతేకాదు వారి వల్ల భారీ కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు కూడా పోగొట్టకోవాల్సి వచ్చింది. అందుకే తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన సినిమాల్లో మాత్రమే నటించేదాన్ని. కానీ ఆ సినిమాలు ఫ్లాపయ్యోవి. ఈ ఘటనల వల్ల చాలా కాలంగా డిప్రెషన్‌లో ఉండిపోయాను. ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ ఘటనలు చిత్ర పరిశ్రమలో చాలా ఎక్కువ. 

అయితే వాటిని ఒప్పుకోవాలని ఎవ్వరూ బలవంతం చేయరు. నా ఆత్మాభిమానాన్ని పోగొట్టుకోలేక ఎందరో పెద్ద నిర్మాతల సినిమాలకు నో చెప్పాను. కొన్నిసార్లు సినిమాలకు సంతకం చేసేశాక తమ సెక్స్ కోరికలు తీర్చమని అడిగేవారు. అలా అడగడంతో నేను తీసుకున్న డబ్బు వెనక్కి ఇచ్చేసి సినిమాల నుంచి నేనే తప్పుకునేదాన్ని. ఓసారి దక్షిణాది నిర్మాత ఫోన్ చేశాడు. భారీ బడ్జెట్ సినిమాలో నాకు అవకాశం ఇస్తానన్నాడు. కానీ దాని వల్ల నాకు లాభమేంటి అని అడిగాడు. నేను బాగా కష్టపడి నటిస్తానని చెప్పాను. కానీ ఆ విషయం నాకు అనవసరం అన్నాడు. దాంతో అతను నా దగ్గర సెక్స్ కోరుకుంటున్నాడని తెలిసి నో చెప్పేశాను. 

హీరోయిన్స్ ఎవరైనా లైంగిక వేధింపుల గురించి మీడియా ముందు మాట్లాడితే అన్ని నిర్మాణ సంస్థల నుంచి ఛాన్సులు ఆగిపోతాయి.  ఈ విషయం అందరికి తెలిసందే. ఇన్నేళ్ల నా కెరీర్‌లో నేను నటించిన 'ఇంటర్‌డిపెండన్స్' సినిమా ఒక్కటే అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా 11 మంది దర్శకులు తెరకెక్కించిన షార్ట్ ఫిలింస్‌ ఈ ఒక్క సినిమాలో కనిపిస్తాయి.. అని వాపోయింది మంజరి. తెలుగులో మంజరి.. అల్లరి నరేష్‌కు జోడీగా 'సిద్ధు ఫ్రం శ్రీకాకుళం', 'శుభప్రదం' సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ నటించిన 'శక్తి' సినిమాలో తారక్‌కు తల్లి పాత్రలోను మెరిసింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: