ఆయన పవన్ ఫుల్ మాస్ డైరెక్టర్. ఆయన టాప్ హీరోలు ఎందరినో పెట్టి సినిమాలు తీసారు. బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు. ఆయన సినిమాలన్నీ పక్కా మాస్. హీరో యాక్షన్ అదుర్స్ అన్నట్లుగా ఉంటుంది. ఇక ఆ డైరెక్టర్ రొమాన్స్ కూడా ఓ రెంజిలో ఉంటుంది. ఆయన హీరోయిన్లు ఫుల్ గ్లామర్ గా కనిపిస్తారు. అటువంటి మాస్ డైరెక్టర్ కి రొమాన్స్ ఇపుడు కావాల్సివచ్చిందట.

 


ఆయనే పవర్ ఫుల్ మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్. ఆయన హీరో అవతారం ఎత్తారు. శీనయ్య మూవీతో వెండి తెర మీద  మెరపులు మెరిపించనున్నారు. దిల్ సినిమాతో తాను ప్రొడ్యుసర్ గా నిలబెట్టిన దిల్ రాజ్ బ్యానర్లోనే శీనయ్యగా వినాయక్ నటించబోతున్నాడు. సరే టైటిల్ ఒకే. మూవీ ఒకే. మరి హీరోయిన్ ఎవరు అంటే అక్కడే సస్పెన్స్ అన్నారు నిన్నటివరకూ. అయితే ఈ మాస్ డైరెక్టర్ హీరోగా అంటే హీరోయిన్లు దొరకడంలేదుట.

 

ఎందరినో తన చేతులతో హీరోయిన్లుగా మార్చిన ఆయనకే హీరోయిన్లు కరవు అయ్యారు. అయితే వినాయక్ తో నటించేందేందుకు సీనియర్ భామ శ్రియ ఒకే అందిట. శ్రియతో వినాయక్  చాలా సినిమాలు డైరెక్టర్ చేశాడు. ఆమెను హీరోయిన్ గా  పెట్టి  చిరంజీవితో ఠాగూరు, బాలక్రిష్ణతో చెన్నకేశవరెడ్డి తీసి హిట్లు కొట్టాడు. అటువంటి శ్రియ పక్కన హీరోగా నటిస్తాన‌ని బహుశా ఈ డైరెక్టర్ గారు అనుకోని ఉండరు. 

 

కానీ ఇపుడు అదే నిజం అవుతోంది. సీనియర్ హీరోగా ఉన్న శ్రియ ఇప్పటికీ నాటౌట్ అంటోంది. పైగా హాటీగా కూడా శ్రియ కసి రేపుతోంది. ఆమె అందం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంది. ఇపుడు శ్రియతో వీవీ వినాయక్ చేసే రొమాన్స్ ఎలా ఉంటుందో చూడాలి  మరి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఇద్దరు తమదైన రొమాన్స్ తో వెండితెరను పండిస్తారన్న మాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: