విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన జార్జిరెడ్డ ఈ శుక్రవారం (22న) విడుదలయి సూపర్ హిట్ టాక్ ని సొంత చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు జీవన్ రెడ్డి, సినిమాటోగ్రాఫర్  సుధాకర్ యక్కంటి మీడియాతో ముచ్చటించారు..

 

దర్శకుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ:
‘‘ జార్జిరెడ్డి ని తెరమీద పరిచయం చేసినందుకు నేను సంతృప్తిగా ఉన్నాను. విద్యార్ధుల నుండి,  ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన నేను ఊహించిన దానికంటే చాలా బాగుంది.  జార్జిరెడ్డి పేరు ఇప్పుడు దేశంలో  వినపడుతుంది. ఆయన చరిత్ర గురించి ఒకటిన్నర సంవత్సరాలు అధ్యయనం చేసి కథను రెడీ చేసుకున్నాను. నేను కలిసిన వారందరూ  చెప్పిన కథలు లలో చాలా వ్యత్యాసాలు చూసాను. కలిసిన  ప్రతి ఒక్కరి దగ్గరా ఒక కథ ఉంది. అందుకే నేను నమ్మిన కథను చరిత్రలోని  వాస్తవ సంఘటలను ఆధారంగా తీసుకొని జార్జిరెడ్డిని ప్రజెంట్ చేసాను. ఈ సినిమా  అందరికీ నచ్చుతుందని మేం మొదటి నుండి అనుకోలేదు. ఎందుకంటే జార్జిరెడ్డి కథే చాలా కాంప్లికేటెడ్ దాన్ని సినిమాగా మలిచేందుకు రాసుకునే ప్రతి అక్షరం విషయంలో నేను చాలా జాగ్రత్త‌  పడ్డాను.

 

ఇప్పడు వింటున్న కథలు తెరమీదకు తెస్తే మీముందు ఇక్కడ కూర్చోలేను. సినిమా కూడా బయటకు రాదు. నాలుగు రెచ్చ‌ గొట్టే సీన్స్ ను తీసి కాంట్రవర్సరీలు చేయడం నాకు ఇష్టం లేదు. మళ్ళీ ఈ సినిమా మూలంగా ఎలాంటి ఘర్షనలు రాకూడదని జాగ్రత్త‌ పడ్డాను.  కానీ జార్జిరెడ్డి వ్యక్తిత్వం, ఆయన నిజాయితీ  వంటి లక్షణాలతో కథను ముందుకు తీసుకెళ్లాను. జార్జిరెడ్డి కథకు హీరోలు అవసరం లేదు అని బలంగా నమ్మాను. నా స్నేహితుడు సందీప్ లో జార్జి రెడ్డిని చూసాను. ఇప్పుడు అందరికీ జార్జిరెడ్డి  సందీప్ లో  కనపడుతున్నాడు.  సినిమా హాల్స్ లో వినపడుతున్న విజిల్స్ , ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన నాకు చాలా సంతృప్తి నిస్తుంది.   తెరమీద జార్జిరెడ్డి కథను నిజాయితీగా చెప్పాను అనే సంతృప్తి నాకు ఉంది. ఆయన జీవితాన్ని ఇప్పటి యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా కొన్ని సన్నివేశాలను డిజైన్ చేసాను. బ్లేడ్ ఫైట్, ఫైర్ వాల్ ఫైట్ యూత్ కి విపరీతంగా నచ్చుతున్నాయి. జార్జిరెడ్డి గురించి చర్చ యూత్ లో మొదలైంది.  జార్జిరెడ్డి యూత్ కి కనెక్ట్ అయ్యాడు. అది చాలు నాకు’’ అన్నారు. 

 

సినిమాటోగ్రాఫర్ సుధాకర్ యక్కంటి మాట్లాడుతూ:
‘‘ 70 వ దశకంలో కాలాన్ని రీ క్రియేట్ చేయడంలో  సక్సెస్ అయ్యామని వస్తున్న కామెంట్స్ మాకు చాలా ఆనందాన్నిస్తున్నాయి. జార్జిరెడ్డి కథను యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా తీయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. జార్జిరెడ్డి వంటి వ్యక్తిని యూత్ కి కనెక్ట్ చేసాం అనే సంతృప్తి మాకు చాలా ఉంది. ఈసినిమా కమర్షియల్ గా కూడా బాగా స్ట్రాంగ్ గా ఉంది. ఇలాంటి చరిత్రను తెరకెక్కించడంలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది.  సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు చాలా పెద్ద థ్యాంక్స్ ’’ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: