జయలలిత ఈ పేరు వినగానే తమిళ తంబిల కల్లో ఒక అనందం, తమిళ రాజకీయ నాయకులకు ఒక సింహ స్వప్నం. ఆమె నటనలో కూడా మహా నటిని అన్న విషయం అందరికి తెలిసినదే. ప్రస్తుతం  జయలలిత బయోపిక్ నిర్మాణంంలో వున్న సంగతి తెలిసిందే. తలైవీ పేరుతో నిర్మాణంలో వున్న జయలలిత బయోపిక్  టీజర్ విడియోను విడుదల చేసారు చిత్ర బంధం.

 

ఎలాంటి పాత్ర అయినా ఒదిగిపోగలనని ఈ మధ్య వరుసగా నిరూపించుకుంటూ వస్తున్న కంగనా రనౌత్ ఈసారి తలైవా పాత్రలో కూడా ఇమిడిపోయినట్లే కనిపిస్తోంది.తమిళ రాజకీయాలను తన కనుచూపుతో శాసించిన నటి, రాజకీయ నాయకురాలు, ఒకప్పటి ముఖ్యమంత్రిగా జయలలిత జీవితం గురుంచి తీస్తున్న సినిమాలో, సినిమా నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో జయలలితగా కంగనా చూపించిన హావ భావాలు భలేగా వున్నాయి. అదే విధంగా రాజకీయ నాయకురాలిగా సరేసరి.

 

దర్శకుడు విజయ్ ఈ బయోపిక్ ను చాలా కేర్ పుల్ గా డిటైల్డ్ గా తయారుచేస్తున్నట్లు కనిపిస్తోంది.  'మీకు బాగా తెలిసిన వ్యక్తి గురించి అస్సలు తెలియని విషయాలు' అనే విధంగా ప్రకటించడం తో సినిమా మీదా అపుడే అనేక ఊహాగానాలు, అనుమానాలు మొదలయ్యాయి. జయలలిత జీవితంలో  శోభన్ బాబుది ఒక ప్రత్యేక మైన పాత్ర. వారిద్దరి మధ్య జరిగిన సంఘ్టనల మీదా చాలా పుకార్లు షికారు చేశాయి. వారిరువురికి ఒక పాప ఉందని,తనని రహస్యం గా ఉంచారని చాలా పుకార్లు ఇప్పటికీ షికారు చేస్తున్నాయి ఇప్పుడు దర్శకుడు చెప్పిన మాటతో  ఈ సినిమాలో దాని మీద కూడా ఒక వివరణ ఇస్తారా లేక సస్పెన్స్ అల్లాగే కొనసాగిస్తారా అనేదే ప్రశ్న. సినిమా రిలీజ్ కళ్ళ ఈ సినిమా మీద ఎదో దుమారం లేగే లాగానే వుంది. మొత్తానికి ఈ సినిమాలో శోభన్ బాబు కూడా ఉంటాడా? లేదా? అన్నది వేచి చుడాలిమరి.

మరింత సమాచారం తెలుసుకోండి: