పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రొమాంటిక్. కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్యక్రిష్ణ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆకాష్ సోలో హీరోగా ఇది మూడవ చిత్రం. మొదటి చిత్రమైన "ఆంధ్రాపోరి" సినిమా ఏమంత ఆడలేదు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో "మెహబూబా" సినిమా ద్వారా ఆకాష్ ని హీరోగా లాంచ్ చేశారు.

 

అయితే ఈ సినిమా కూడా విజయం సాధించలేదు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. సినిమా బాగున్నప్పటికీ పూరి జగన్నాథ్ సినిమాలో ఉండే టేకింగ్ ఈ సినిమాలో లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాని తిప్పి కొట్టారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఆకాష్ నటనకి మంచి పేరొచ్చింది. అయితే ఈ సినిమా తర్వాత మళ్లీ పూరి కనెక్ట్స్ బ్యానర్ లోనే సినిమా చేస్తున్నాడు.

 

ఈ సారి మరింత కొత్తగా ఆకాష్ రాబోతున్నాడు. పూరి జగన్నాథ్ సినిమాల్లో గ్లామర్ పాళ్ళు ఎక్కువ ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సారి ఆకాష్ కూడా అలాంటి సినిమాతోనే వస్తున్నాడు. మొన్నరిలీజైన ఫస్ట్ లుక్ ని చూస్త్ంటే ఈ విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. దానికితోడు సినిమా పేరుని కూడా "రొమాంటిక్" అని పెట్టడంతో ఈ సినిమా బోల్డ్ గా ఉంటుందని తెలుస్తుంది. అయితే రొమాంటిక్ సినిమా గోవాలో చిత్రీకరణ జరుపుకుంది.

 

నేటితో గోవాలో చిత్రీకరణని పూర్తి చేసుకుని హైదరాబాద్ కి వచ్చేసింది. గోవా షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు, యాక్షన్ సీన్స్‌, పాటలని చిత్రీకరించారు.ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న చిత్రమిది.సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తుండగా నరేశ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: