ఒక సినిమా పూర్తి అయి చాలా రోజులవుతున్నా థియేటర్లలోకి రాకపోతే ఆ సినిమా దర్శకుడికి, హీరోకి ఎలా ఉంటుందో ఊహించలేం. ముఖ్యంగా నిర్మాతకి చాలా నష్టం వస్తుంది. ఈ పరిస్థితి ముఖ్యంగా చిన్న సినిమాలకి ఎదురవుతుంది. ప్రతీ చిన్న సినిమా నిర్మాత, దర్శకుడు, హీరోలు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటారు. మొన్నటి వరకు హీరో నిఖిల్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు.

 

నిఖిల్ నటించిన అర్జున్ సురవరం సినిమా ఓ ఆర్నెళ్ళ క్రితమే రిలీజ్ అవ్వాల్సింది. కానీ ఆర్థిక కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ అవలేదు. ఈ సినిమాకి వచ్చినన్ని రిలీజ్ డేట్లు మరే సినిమాకి రాలేదెమో!  ప్రతీ విడుదల తేదీ ప్రకటించాక ఏవేవో కారణాల వల్ల వాయిదా పడేది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఈ నెల 29 వ తేదీన విడుదల అవనుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్ ని విడుదల చేసి ప్రమోషన్స్ ని మొదలుపెట్టింది.

 

సినిమా తమిళ చిత్రమైన కణిథన్ చిత్రానికి రీమేక్. విడుదల అయిన ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. దీంతో చిత్ర యూనిట్ మరింత జోష్ తో ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. నిఖిల్ ఇప్పటికే ఈ చిత్రం గురించి అభిమానులతో లైవ్ లో మాట్లాడాడు. అయితే విడుదల తేదీ దగ్గర పడడంతో సినిమాకి హైప్ తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారట.

 

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ రానున్నాడని సమాచారం. ఠాగూర్ మధు సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రం కోసం మెగాస్టార్ రానున్నాడట. ఒకవేళ మెగాస్టార్ఈవెంట్ కి హాజరయితే గనక నిఖిల్ సినిమాకి మంచి హైప్ వచ్చేసినట్టే. మరి ఏం జరుగుతుందో చూడాలి. నిఖిల్ కి చిరంజీవి సాయం చేస్తాడా లేదా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: