టాలీవుడ్ సినిమా పరిశ్రమకు తొలిసారిగా అంతం సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా అడుగుపెట్టిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ, తొలి సినిమాతో మంచి మ్యూజిక్ ఇచ్చి ఆకట్టుకున్నారు. ఇక అక్కడినుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు సాగిన మణిశర్మ, తన కెరీర్ లో మెగాస్టార్ చిరంజీవి దగ్గరి నుండి యంగ్ హీరో రామ్ వరకు దాదాపుగా అందరు స్టార్ హీరోలతో పనిచేయడంతో పాటు ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఇకపోతే ఇటీవల కాలంలో దేవిశ్రీప్రసాద్, థమన్, మిక్కీ జె మేయర్ వంటి నూతన సంగీత దర్శకుల రంగప్రవేశంతో మెల్లగా సినిమాలు చేయడం తగ్గించిన మణిశర్మ

 

కొన్నాళ్ల క్రితం వరకు చాలావరకు సినిమాలు చేయలేదు అనే చెప్పాలి. ఇక ఇటీవల మళ్ళి అక్కడక్కడా కొన్ని సినిమాలకు మ్యూజిక్ ఇవ్వడం మొదలెట్టిన మణిశర్మ, కొద్దిరోజుల క్రితం నాని హీరోగా వచ్చిన జెంటిల్ మ్యాన్, రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలకు అదిరిపోయే సాంగ్స్ అందించిన మణిశర్మ, ప్రస్తుతం రెండు భారీ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇక నేడు టాలీవుడ్ వర్గాల్లో విరివిగా ప్రచారం అవుతున్న వార్తను బట్టి మెగాస్టార్ 152 మూవీతో పాటు, వెంకటేష్ హీరోగా తెరకెక్కనున్న అసురన్ రీమేక్ కు కూడా మణిశర్మ సంగీతాన్ని అందించబోతున్నట్లు చెప్తున్నారు. 

 

నిజానికి మెగాస్టార్ 152 మూవీ కోసం మొదట దేవిశ్రీప్రసాద్ ని ఎన్నుకున్నప్పటికీ ఆయనకు డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఫైనల్ గా ఆ సినిమా యూనిట్ మణిశర్మ కు ఓటేసిందట. ఇక అలానే అసురన్ తెలుగు రీమేక్ కు దర్శకత్వం వహించబోతున్న శ్రీకాంత్ అడ్డాల, నిర్మాత సురేష్ బాబు, హీరో వెంకటేష్ లు కూడా తమ సినిమాకు మణిశర్మ అయితేనే సరైన న్యాయం చేయగలరని భావించి ఆయననే ఫిక్స్ చేయడానికి సిద్ధం అయ్యారట. మరికొద్దిరోజుల్లో ఈ రెండు సినిమాల విషయమై అధికారిక ప్రకటన కూడా వెలువడబోతున్నట్లు తెలుస్తోంది. కాగా దీనిని బట్టి మణిశర్మ రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే అని అంటున్నారు సినీ విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: