అక్కినేని నాగ చైతన్య తన భార్య సమంత తో కలిసి నటించిన మజిలి బ్లాక్ బస్టర్ హిట్ తో ఫుల్ ఫాం లోకి వచ్చేశాడు. వరుసగా సినిమాలకి సైన్ చేస్తూ గ్యాప్ లేకుండా బిజి బిజీగా ఉన్నాడు. అందులో బాగంగానే మేనమామ వెంకటేష్ తో కలిసి వెంకీ మామా కంప్లీట్ చేశాడు. ఈ సినిమా రిలీజ్ రెడీ అవుతోంది. రాశీ ఖన్నా చైతూకి జోడీగా నటించింది. బాబీ దర్శకత్వం వహించాడు. పీపుల్స్ మీడియా పతాకంపై తయారవుతున్న ఈ సినిమా డిసెంబర్ 13న విడుదలవుతోంది. ఇక చైతన్య బర్త్ డే సందర్భంగా టీజర్ విడియోను విడుదల చేసారు. టీజర్ విడియోలో కథ ఎలా ఉంటుందో చిన్న హింట్ ఇచ్చారు చిత్ర బృందం. 

 

మామా అల్లుళ్ల హుషారు...అల్లుడి ప్రేమ కథ, ఆ తర్వాత మిలట్రీలో చేరి బోర్టర్ లోకి వెళ్లడం, అల్లుడి కోసం మామ మిలట్రీ అధికారుల దగ్గరకు వెళ్లడం వంటివన్నీ కలిపి ఈ విడియోను కట్ చేశారు. దీన్ని బట్టి మిగతా సినిమా ఎలా ఉంటుందో ప్రేక్షకులకు అర్థమైపోతోంది. ఇక విడియో మాత్రం కలర్ పుల్ గా, అన్ని రకాల ప్రేక్షకులను సినిమాకు రప్పించే చక్కటి ఫ్యామిలీ ఎలిమెంట్స్ సినిమాలో వున్నట్లుగా స్పష్టం చేస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. 

 

ఇక నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలోని సినిమా(ఎన్.సి19) ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఫిదా బ్యూటీ సాయి పల్లవి ఈ సినిమాలో చైతూకి నటిస్తోంది. చైతూ ఈ సినిమాలో ఓ స్పోర్ట్స్ మేన్ గా కనిపించబోతున్నాడని తెలిసిందే. ఈ సినిమా శేఖర్ కమ్ముల మార్క్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుండి చైతూ కి బర్త్ డే విషెస్ చెప్తూ చిన్న టీజర్ ను వదిలారు. ఈ టీజర్ చూస్తుంటే మన ఇంట్లో మన సొంత పనులు ఎలా చేసుకుంటామో చైతూ కూడా అలానే అన్నీ పనులు తనే చేసుకునేలా అనిపిస్తోంది. చూపురు పట్టి ఊడ్చటం, చిన్నారులతో ఆడటం..ఇవన్నీ పక్కా ఫ్యామిలి ఎమోషనల్ డ్రామా అని క్లారిటి వస్తోంది. మరి ఈ రెండు సినిమాలు అక్కినేని ఫ్యాన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి. మొత్తానికి చైతూ బర్త్ డే స్పెషల్ కి రెండు సినిమాలు ఎలా ఉండబోతున్నాయో బర్త్ డే గ్లింస్ తో క్లారిటి ఇచ్చారు. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: