దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంటే తెలియని వారు లేరు. తమిళులకు జయలలిత గారంటే ఉన్న అభిమానం మాటల్లో చెప్పలేము. ఇలాంటి పాపులర్ రాజకీయ నాయకురాలి బయోపిక్ వస్తుందంటే అభిమానులకు ఎంతగానో ఆసక్తి ఉంటుంది. అందుకే జయలలిత జీవిత కథ ఆధారంగా తెలుగు, తమిళ, హిందీ బాషల్లో  రూపొందుతున్న ఈ చిత్రంలో జయలలితగా కంగనా రనౌత్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ చెన్నైలో ప్రారంభమైంది.

 

 

ఇకపోతే ఎంజీఆర్‌ లేకుండా జయలలిత బయోపిక్‌ను ఊహించలేం. అలాంటి లెజెండ్రీ రాజకీయ నాయకుడు పాత్రలో ప్రముఖ నటుడు అరవిందస్వామి నటిస్తున్నారు. అదీగాకుండా అమ్మ జయలలిత గా నటించడం అంటే ఆషామాషీనా? తనకంటూ ఓ ఇమేజ్ ఉంది. కథానాయికగా.. నాయకురాలిగా ప్రజల్లో ఓ స్టాటస్ ఉంది. ఇదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అసాధారణ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ముఖ్యంగా తమిళనాడు యావత్తూ అమ్మ అంటే పడి చచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అమ్మ బయోపిక్ కు సంబంధించి తలైవి లుక్ రాగానే ఫ్యాన్స్ ఏమన్నారంటే,

 

 

ఆ మాటలు వింటే చెవులు మూసుకోవాల్సిందేనట. ఒక్కో తంబీ ఫ్యాన్స్ ఒక్కోలా కంగనను ఆడేసుకున్నారు. ఇది అమ్మ ఫేర్ లుక్! అని కొందరు సందేహం వ్యక్తం చేస్తే.. చాఛీ 420 లుక్ ఇదని కొందరు తిట్టేశారు.  ప్రోస్థటిక్స్ మిస్ ఫైర్ అయ్యిందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. లుకింగ్ ఫేక్ అని కొందరు.. కేజీ మేకప్ వేసుకున్న కంగన హిలేరియస్ అని మరికొందరు .. డిజాస్టర్ అంటూ ఇంకొందరు కామెంట్లు గుప్పిస్తుండడం.. వ్యంగ్యంగా ఎల్.ఓ.ఎల్ ఈమోజీల్ని షేర్ చేయడం చూస్తుంటే కంగన తో పాటు మేకప్ వేసిన పెద్దాయన.. సినిమా తీస్తున్న ఫిలిం మేకర్స్ ఇక కళ్లు చెవులు మూసుకోవాల్సిందే అన్నంతగా పరిస్థితి ఇప్పుడు ఉందట..

 

 

ఇకపోతే ఈ తిట్లతో ట్విట్టర్లు ఇప్పటికే జామైపోయాయి. ఒకటేమిటీ ఫేస్ బుక్.. ఇన్ స్టాల్లోనూ తిట్లు చీవాట్లు ప్యాక్ అయిపోయాయి. ఈ తిట్ల సెటైర్ల ప్రవాహం చూస్తుంటే తలైవికి ఉన్న ఫాలోయింగ్ ఏపాటిదో ఇప్పటికే అందరికీ  మరోసారి తెలిసి ఉంటుంది. అయినా వాళ్లు మనలాగా సాఫ్ట్ గా ఉండే తెలుగు యూత్ అనుకున్నారా?  ఎన్టీఆర్ బయోపిక్ లుక్ రాగానే ఎంత బావుందో అంటూ పొగిడేసినట్టు పొగిడేయడానికి..! పక్కా ఊర మాస్ తంబీలతోనే పెట్టుకున్నారు మరి. ఇక ఇప్పటికే తేడా లొస్తే ఆ మాత్రం బడితె పూజ ఉంటుందని చాలా ముందే తలైవి టీమ్ కి తెలిసొచ్చిందన్న మాట అని అనుకుంటున్నారు ఈ విషయం తెలిసిన కొందరు...

మరింత సమాచారం తెలుసుకోండి: