ఒక సినిమాలో ఏ స్టార్స్ లేకుండా కేవలం ట్రైలర్ తో ప్రేక్షకులను ఆకర్షించడం అంటే అంత మామూలు విషయం కాదు. ఈ విషయం ఎన్నో సందర్భాల్లలో ప్రూవ్ అయింది కూడా. అంతేకాదు అలా ఆకట్టుకోవడం చాలా తక్కువ సినిమాలకే జరుగుతుంది. అయితే ఈ శుక్రవారం విడుదలైన 'జార్జ్ రెడ్డి' సినిమా విషయంలో సరిగ్గా ఇలానే జరిగింది. ఇంటెన్స్ ట్రైలర్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది 'జార్జ్ రెడ్డి' సినిమా. ఈ శుక్రవారం చాలా సినిమాలు రిలీజ్ అయినప్పటికీ యూత్ లో 'జార్జ్ రెడ్డి' సినిమాకు మాత్రం విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఒక రకంగా అదే సినిమాకి బాగా ప్లస్సయ్యింది. 

 

రివ్యూస్.. పబ్లిక్ టాక్ యావరేజ్ గానే ఉన్నప్పటికీ 'జార్జ్ రెడ్డి' మొదటి రోజు మంచి కలెక్షన్స్ నమోదు చేసిందని ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం. జార్జ్ రెడ్డి జీవితంలోని యాక్షన్ పార్ట్ పై ఎక్కువ దృష్టి పెట్టి.. ఆయన మేథాశక్తి.. సామాజిక అసమానతలపై పోరాటం జరిపిన విధానాన్ని కరెక్ట్ గా తెరపై చూపించలేదని కొన్ని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ విమర్శలతో సంబంధం లేకుండా సినిమాలోని యాక్షన్ పార్ట్ కు ప్రేక్షకుల నుంచి, ముఖ్యంగా యూత్ నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా కర్చీఫ్ బ్లేడ్ ఫైట్.. ఐరన్ ఫైర్ బాల్ ఫైట్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి ఇంకా పెరుగుతోంది.

 

సందీప్ మాధవ్ హీరోగా నటించిన ఈ సినిమా కు జీవన్ రెడ్డి దర్శకత్వం వహించాడు. పాత్రలు కల్పితం అనే స్లైడ్ వేసినప్పటికీ ఈ సినిమా ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్ధి సంఘం నాయకుడు జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిందనే విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా ఫుల్ రన్ లో ఎంత కలెక్షన్స్ వసూలు చేస్తుందనేది వేచి చూడాలి. బయోపిక్ లో ఇలాంటి వాస్తవిక ఘటనతో తెరకెక్కిన సినిమాలు ఒకరకంగా ఇప్పటివరకు రాలేదని చెప్పాలి. అందుకే ఈ సినిమాకి ఇంతగా ఆదరణ దక్కుతోందని జనాలు చెప్పుకోవడం విశేషం.  

మరింత సమాచారం తెలుసుకోండి: