అక్కినేని హీరో నాగచైతన్య కు చాలం కాలం నుండి హిట్ సినిమాలు లేవు. పెళ్లైయ్యాక సమంతతో చేసిన మొదటి సినిమా మజిలీతో.. నాగచైతన్య సూది తిరిగిందని చెప్పాలి. ఆ సినిమా హిట్  అవ్వడంతో చైతు వరుస సినిమాలలో నటిస్తున్నారు. సమంత తో ఏది చేసిన కూడా అది హిట్టే అని చైతు కూడా మరోసారి నిరూపించారు. ఇకపోతే చైతు ఇప్పుడు దాదాపుగా మూడు సినిమాలలో నటిస్తున్నారు. 

 

చైతు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం చైతు మామ వెంకీ తో వెంకీ మాం సినిమాలో నటించారు. ఆ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని ప్రస్తుతం ప్రమోషన్లో బిజీగా ఉంది. క్రిస్టమస్ కానుకగా సినిమా విడుదల కాబోతుంది. ఇప్పటివరకు ఈ సినిమా పై పాజిటివ్ టాక్ ఈ సినిమాకు హిట్ టాక్ అవుతుందని చిత్ర యూనిట్ ఈసినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

 

ఇకపోతే ప్రస్తుతం చైతు కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి చితుకు జోడిగా నటిస్తుంది. ఈ సినిమా కూడా చిత్రీకరణలో బిజీగా ఉంది. పల్లెటూరు వాతావరణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇకపోతే ఈ సినిమా కూడా హిట్ అవుతుందని చిత్ర యూనిట్ భారీ అంచనాలని పెట్టుకుంది. 

 

నవంబర్ 23 న నాగచైతన్య పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమాకు సంబందించిన ఒక చిన్న ప్రోమోను  చిత్రబృందం విడుదల చేశారు. ఈ ప్రోమోలో నాగ చైతన్య మిడిల్ క్లాస్ అబ్బాయిలాగా కనిపిస్తాడు. ``చైత‌న్య19 ప్ర‌పంచంలోకి స్వాగ‌తం. ఈ ప్ర‌పంచం నాకు ఇల్లులాంటిది. సింపుల్‌, బ్యూటీఫుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల‌కు స్వాగ‌తం`` అని చైత‌న్య ట్వీట్ కూడా చేశారు. సోనాలి నారంగ్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ ఎల్ పి, ఎమిగోస్ క్రియేష‌న్స్ ప‌తాకాల‌పై నారాయ‌ణ్ దాస్ కె.నారంగ్‌, పి.రామ్మోహ‌న్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: