సాయిపల్లవి ని చూసినపుడు ఎవరికైనా తమ పక్కింట్లో ఎదురింట్లో ఉన్న అమ్మాయిగా అనిపిస్తుంది. సాయిపల్లవి  గురించి మీడియా ముఖంగా తెలుసుకున్న వారికి
 యాటిట్యూడ్ అందరికీ నచ్చుతుంది. ఆమె అందం కాదు, అభినయం కాదు, ఆమె  బిహేవియర్ ఇపుడు అతి పెద్ద ఆకర్షణగా మారింది. సాయిపల్లవి ఓ విధంగా ఇపుడు ఉన్న కాస్టింగ్ కౌచ్ వివాదాల చిత్ర సీమలో తులసీదళంలా మెరుస్తోందని చెప్పాలి.

 

సాయిపల్లవి లాంటి అమ్మాయిలు ఉంటే ఏ ఫీల్డ్ అయినా ధైర్యంగా వారిని పంపించవచ్చుననిపిస్తోంది. ఇపుడు కాస్టింగ్ కౌచ్ మీద విపరీతమైన చర్చ సాగుతోంది. లైంగిక దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. అయితే సాయిపల్లవి లాంటి వారు కచ్చితంగా ఉంటే ఎవరూ కూడా ఆ వైపు కూడా తొంగిచూడరని అంటున్నారు.

 

మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాయిపల్లవి డాక్టర్ కావాలనుకుని యాక్టర్ గా మారింది. ఆమె సినిమాల్లో కూడా వ్యక్తిత్వాన్ని ఉట్టిపడే పాత్రలనే ఎంచుకుంటోంది. ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉండడమే కాదు, తనకు వచ్చిన పెద్ద ఆఫర్లను కూడా తిరస్కరించి తానేంటో ప్రూవ్ చేసుకుంటోంది. సాయిపల్లవికి ఏడాదికి కోటి రూపాయలు ఇస్తామంటూ యాడ్ ప్రకటనల్లో నటించమన్నారుట.

 

అయితే తాను అలాటివాటిలో నటించనంటూ గట్టిగా తిరస్కరించింది ఈ భామ. తానేంటో మాత్రమే కాదు, జీవితం అంటే ఏమిటో కూడా బాగా తెలుసుకున్న సాయిపల్లవిలో  వేదాంత భావాలు కూడా ఎక్కువే మరి. ఎంత సంపాదించినా త్రుప్తి లేకపోతే బతుకు కష్టమని సాయిపల్లవి చెబుతూంటే వెండి తెర జిలుగుల మధ్య ఉన్న అమ్మాయి ఒక సాధువులా మాట్లాడడం సాధ్యమేనా అనిపిస్తుంది.

 

ఇదిలా ఉండగా సత్యసాయి భక్తురాలైన సాయిపల్లవి పుట్టపర్తిలోని బాగా మందిరానికి ఒక సామాన్య భక్తురాలిగా తల్లి రాధా కన్నన్ తో కలసి నడుచుకు వెళ్తున్న‌ ద్రుశ్యాలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.  మంచితనం, సంస్కారం మనలో ఉండాలి కానీ ఎవరు మనలను ఏమీ చేయలేరు అన్న దానికి సాయి పల్లవి అచ్చమైన నిదర్శనం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: