ఇలియానా గురించి అందరికి తెలుసు.  దేవదాస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ గోవా బ్యూటీ ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చింది.  ఎంట్రీ సినిమాతోనే అదరగొట్టిన ఈ బ్యూటీ .. ఆ తరువాత చేసిన ప్రతి సినిమా హిట్ అయ్యింది.  దేవుడు చేసిన మనుషులు వరకు తెలుగులోను, ఇటు సౌత్ లోను సినిమాలు చేసిన ఇల్లి బ్యూటీ.. ఎందుకో సడెన్ గా సౌత్ నుంచి బాలీవుడ్ కు చెక్కేసింది.  అదే ఆమెకు ఇబ్బంది కలిగించింది. 

బాలీవుడ్ ఒకరి రెండు హిట్లు కొట్టినా అక్కడ ఉన్న కాంపిటీషన్ ను తట్టుకోలేకపోయింది.  పైగా విదేశీ ఫోటో గ్రాఫర్ తో ప్రేమలో పడింది.  ఆ తరువాత డిప్రెషన్ లో పడింది.  చివరకు నిద్ర పోవడానికి స్లీపింగ్ టాబ్లెట్ వాడి ఏకంగా లావయ్యింది.  ఆ లావును చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు.  అదేంటి అలా లావు కావడం ఏంటి అని షాక్ తిన్నారు.  డిప్రెషన్ నుంచి బయటకు వచ్చిన ఇలియానా.. ఆ తరువాత పెద్దగా సినిమాలు చేయలేదు.  
అయితే, ప్రస్తతం హిందీలో ఓ రెండు సినిమాలు చేస్తున్నది.  మరోవైపు తన లావు తగ్గించుకునే పనిలో కూడా పడింది ఈ బ్యూటీ.  ఈ బ్యూటీ చేస్తున్న సినిమాలు పక్కన పెడితే.. తెలుగులో ఛాన్స్ కోసం ప్రయత్నం మొదలు పెట్టింది.  ఈ ప్రయత్నం ఎప్పటి వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.  ఒకానొక దశలో ఇలియానా ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నట్టు తెలుస్తోంది.  దానికి కారణం లావు పెరగడమే అంటారు.  
లావు పెరిగిన కారణంగా ఇల్లి బ్యూటీ స్టెప్ తీసుకోలేకపోయింది.  ఫోటోగ్రాఫర్ తో బ్రేక్ అప్ తరువాత ఇప్పుడు తిరిగి యధాస్థితికి వచ్చినట్టుగా తెలుస్తోంది.  ఇదే నిజమైతే.. ఇల్లి బ్యూటీ తిరిగి సినిమా ఇండస్ట్రీలో రాణించడం ఖాయమే.  అయితే, ఎలా రాణిస్తుంది.  ఎలా సినిమాలు దక్కించుకుంటుంది.  హీరోలు ఛాన్స్ ఇస్తారా.. హిట్ సినిమాల్లో అవకాశం వస్తుందా అన్నది తెలియాలి.  పరిచయాలు ఉంటె సినిమా అవకాశాలు తెచ్చుకోవడం పెద్ద విశేషం కాదు కదా.  

మరింత సమాచారం తెలుసుకోండి: