అందాల రాక్షసి చిత్రంతో తెలుగు తెరకు పరిచయ‌మ‌య్యింది లావ‌ణ్య త్రిపాఠి. ప‌లు చిత్రాల్లో నటించిన భలే భలే మగాడివోయ్..మంచి గుర్తింపునిచ్చింది. నాగార్జున స‌ర‌స‌న సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో కూడా తన నటనకు మంచి పేరోచ్చింది. ప్ర‌స్తుతం ఈ భామ యంగ్ హీరో నిఖిల్ తో జంటగా న‌టిస్తుంది. టి. సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ అర్జున్ సురవరం. వెన్నెల కిషోర్, పోసాని, నాగినీడు వంటి నటులు కీలకపాత్రలు చేయగా రాజ్ కుమార్ ఆకెళ్ళ నిర్మించారు. కాగా ఈ చిత్రం న‌వంబ‌ర్ 29న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠీ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ విశేషాలు మీకోసం...

 


చాలా గ్యాప్ తీసుకున్న‌ట్లున్నారు?
గ్యాప్ వ‌చ్చిన మాట నిజ‌మే కానీ దానికి కారణం నేను మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూడడమే. మంచి సినిమాలు మాత్రమే చేయాలనే ఉద్దేశంతో కొన్ని స్క్రిప్ట్ రిజెక్ట్ చేయడం జరిగింది. పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే చేయాలని నిర్ణయించుకున్నాను. ఎవరో ఎదో అనుకుంటారని, అవకాశాలు లేవని సినిమాలు ఒప్పుకోను. నేను నాలానే ఉండటానికి ఇష్టపడతాను.

 

అర్జున్ సురవరం మూవీలో నటించడానికి కారణం?

ఈ మూవీని కూడా ఫస్ట్ నేను తిరస్కరించడం జరిగింది. తమిళ రీమేక్ కావడం వలన వద్దు అనుకున్నాను. కానీ పూర్తి కథ విన్న తరువాత నా పాత్రకు ప్రాధాన్యం ఉందని తెలిసి ఒప్పుకోవడం జరిగింది. తమిళ స్క్రిప్ట్ ని కొంచెం మార్చి నా పాత్రకు అదనపు సన్నివేశాలు జోడించారు.

 

ఈ చిత్రంలో మీ పాత్ర గురించి?

నేను ఈ చిత్రంలో ఒక జర్నలిస్ట్. హెడ్ స్ట్రాంగ్ కలిగి ఇండిపెండెంట్ లక్షణాలున్న అమ్మాయిగా నా పాత్ర ఉంటుంది. అలాగే ఈ చిత్రం కోసం కొన్ని ప్రమాదకరమైన స్టంట్ట్స్ కూడా చేశాను. ఓ సన్నివేశంలో నేను ఉన్న కారు రన్నింగ్ లో ఉండగా రెండు ప్రక్కల నుండి రెండు కార్లు వచ్చి గుద్దే సన్నివేశాలలో నటించాను. అలాగే ఇంకా కొన్ని ప్రమాదకర సన్నివేశాలలో నటించాల్సి వచ్చింది.

 

మీ తదుపరి చిత్రాలు?

నెక్స్‌ట్‌ మూవీలో నేను హాకీ ప్లేయర్ గా చేస్తున్నాను. ఆపాత్రకోసం హాకీ నేర్చుకుంటున్నాను. అలాగే బైక్ రైడింగ్ వంటివి కూడా నేర్చుకుంటున్నాను. ఈ మూవీ వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది.

 

హీరోయిన్ కాకపోతే క్రీడలలో రాణించేవారా?

అలా ఏమి కాదు. నేను జస్ట్ స్పోర్ట్స్ బాగా ఇష్టపడతాను. టేబుల్ టెన్నిస్ బాగా ఆడతాను. నా మేనల్లుడు స్టేట్ లెవెల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్. మా అమ్మగారు కూడా తన కాలేజ్ డేస్ లో హాకీ ఆడేవారట.

 

ఖాళీగా ఉన్నప్పుడు ఏమి చేస్తుంటారు?

ట్రావెలింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కడికైనా ట్రిప్ కి వెళుతుంటాను. ఈ మధ్యనే పుష్కర్ వెళ్ళాను. మరలా డాన్స్ నేర్చుకుంటూ ఉంటాను.

 

అర్జున్ సురవరం మూవీ గురించి ?

నేటి కాలానికి సంబందించిన సోషల్ బర్నింగ్ ఇష్యూ పై ఈ సినిమా తెరకెక్కింది. కొందరు చేసే మోసం వలన బాగా చదువుకొని, తెలివి అర్హత ఉండి ఉద్యోగం లేకుండా ఖాళీగా తిరుగుతున్నారు. కొందరు ఎటువంటి అర్హతలు లేకపోయినా ఆ ఉద్యోగం చేస్తూ హాయిగా గడుపుతున్నారు. ఈ పాయింట్ ఆధారంగా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ తో మూవీ ఆసక్తికరంగా ఉంటుంది.

 

హీరో నిఖిల్ గురించి చెప్పండి?

నిఖిల్ చాలా ఫ్రెండ్లీ మరియు హార్డ్ వర్కింగ్ నేచర్. ఈ మూవీలో అతని పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. ఆయనతో వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది.

 

సినిమా చాలా లేట్ ఐయినట్లుంది?

అవును అది నిజంగా బాధాకరమైన విషయం. నేను కూడా ఈ మూవీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూశాను. మూవీ ట్రైలర్ విడుదల‌య్యాక చిత్రంపై నమ్మకం వచ్చింది. మూవీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: