తెలుగు సినిమా హీరో అంటే ఒక్కో దశలో ఒక్కో ట్రెండ్ నడిచేది. ఎన్టీఆర్, ఏన్నార్, కృష్ణ, శోభన్ బాబు.. టైమ్ హీరోయిజం అంటే ఇన్ షర్ట్, క్లీన్ షేవ్, కళ్లజోడు.. ఉంటేనే హీరోయిజం. ముఖ్యంగా హీరోకు గడ్డం ఉండకూడదు. వయసు మీద పడినా కూడా అప్పటి హీరోలు ఇవన్నీ ఖచ్చితంగా పాటించాల్సిందే. అయితే తర్వాత తరంలో హీరోయిజంలో మార్పు వచ్చింది. చిరంజీవి రాకతో హీరోయిజం పూర్తిగా మారిపోయి.. ఒరిజినాలిటీ వచ్చింది.

 

 

అదే చిరంజీవి హీరోయిజాన్ని మరోస్థాయికి తీసుకెళ్లిపోయాడు. ఆహార్యంలోనే గంభీరాన్ని చూపించేలా చేశాడు. ముఖ్యంగా 1990లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా చిరంజీవి కొన్ని సీన్లలో గెడ్డంతో నటించాడు. అప్పటి వరకూ హీరోలకు గెడ్డం ట్రాజెడిక్ సీన్లలో తప్ప మరే సందర్భంలోనూ ఉండేది కాదు. కానీ జగదేకవీరుడు.. సినిమాతో ట్రిమ్ గెడ్డంతో కనిపించి ఆకట్టుకున్నాడు. అదే ఏడాది బొబ్బిలి రాజాలో వెంకటేశ్ సినిమా మొత్తం గెడ్డంతో కనిపించాడు. సినిమాలో హీరో రఫ్ గా కనిపించాలంటే సన్నని గెడ్డంతో కనిపించడం తప్పనిసరి అయిపోయింది. తర్వాతి ఏడాది.. గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి గెడ్డంతో చూపిన హీరోయిజం తెలుగు సినిమాలకు ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోయింది. దీంతో గెడ్డం పెంచడం యూత్ లో ఓ స్టైల్ అయిపోయింది.

 

 

అయితే నాగార్జున, బాలకృష్ణకు ఈ గెడ్డం అంతగా సూట్ కాలేకపోయింది. మాస్ సినిమాల్లో కూడా వారు క్లీన్ షేవ్ తోనే కనిపించేవారు. చిరంజీవి, వెంకటేశ్ లకు మాత్రమే గెడ్డం యాప్ట్ అయింది. తర్వాత తరంలో కూడా హీరోలు మాసివ్ లుక్ లో కనిపించేందుకు గెడ్డం కాన్సెప్ట్ రెగ్యులర్ అయిపోయింది. ఈ జనరేషన్ లో మరింత గుబురు గెడ్డం పెంచడం కూడా ఫ్యాషన్ అయింది. రామ్ చరణ్, వరున్ తేజ్, సాయి ధరమ్ తేజ్ గుబురు గెడ్డంతో సినిమాలు చేసి హిట్లు కొట్టారు.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: