భారతీయ సినిమా పరిశ్రమలో దక్షిణాది సినీ పరిశ్రమకు ప్రత్యేక స్థానం ఉంది. ఉత్తరాది మొత్తానికి బాలీవుడ్ మాత్రమే పెద్ద సినీ పరిశ్రమ. కానీ దక్షణాదిలో ఉన్న నాలుగు భాషల్లో నాలుగు సినీ పరిశ్రమలు పెద్దవే. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో సినిమాల ప్రభావం ఎక్కువ. హీరోలను హీరోలుగా చూడకుండా ఆరాధ్య దైవాలుగా చూడడం ప్రపంచ సినీ పరిశ్రమలో ఈ నాలుగు భాషల్లోనే సాధ్యమైంది. అటువంటి సినీ పరిశ్రమలో 1980 బ్యాచ్ కు చెందిన సీనియర్ హీరోలు, హీరోయిన్లు అందరూ కలిసి ప్రతి ఏటా గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుంటున్నారు.

 

 

ప్రతి ఏటా జరిగే ఈ కార్యక్రమం ఒక్కోసారి ఒక్కోచోట జరుగుతూంటుంది. 80’s రీ-యూనియన్ పేరుతో జరిగే ఈ కార్యక్రమం ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరుగుతోంది. తన ఇంట్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం నిన్న ప్రారంభమై నేడూ కొనసాగుతోందని సమాచారం. ఈ కార్యక్రంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, వెంకటేశ్, భానుచందర్, సురేశ్, నరేశ్, భాగ్యరాజ్, జాకీష్రాఫ్, జయసుధ, లిజీ, శోభన, సుహాసిని, రాధ, రాధిక, నదియా, రమ్యకృష్ణ, టీనా అంబానీ.. తదితరులు ఈ రీ-యూనియన్ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలుస్తోంది. ఇంకా పలువురు అతిధులు హాజరవుతారని కూడా తెలుస్తోంది. అతిధుల కోసం మెగాస్టార్ భారీ ఏర్పాట్లు చేశారని అంటున్నారు.

 

 

ర్యాంప్ వాక్స్, కామెడీ స్కిట్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్.. ఇలా చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేసారట చిరంజీవి. అతిధులకు మంచి పసందైన వెరైటీల విందుతోపాటు చిరు దోశ కూడా స్పెషల్ అని తెలుస్తోంది. చిరు దోశ పేరుతో చిరంజీవి పేటెంట్ రైట్ కూడా తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా జరిగే కార్యక్రమాల్లో అందరూ ఒకే రంగు డ్రెస్ కోడ్ ను పాటిస్తారు. ఈసారి ఏమేం స్పెషల్స్ జరిగాయో తెలియాలంటే అఫీషియల్ గా చిరంజీవి నుంచి పిక్స్ రిలీజ్ కావాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: