జూబ్లీహిల్స్ లో అత్యంత విలాసవంతమైన ఇల్లు కట్టుకున్న చిరంజీవి తన ఇంటి వైభోగాన్ని తన 1980 ఫిలిం స్టార్స్ రీ యూనియన్ బ్యాచ్ కి చూపించడానికి నిన్న చిరంజీవి హోస్ట్ చేసిన డిన్నర్ పార్టీ వివరాలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. 1980 ఫిలిం స్టార్స్ రీ యూనియన్ పార్టీ నిన్న అత్యంత ఘనంగా జరగడమే  కాకుండా ఈ కార్యక్రమానికి దక్షిణాది సినిమా రంగానికి చెంది చిరంజీవితో సన్నిహితంగా ఉండే ఎందరో ఫిలిం సెలెబ్రెటీలు ఈపార్టీకి వచ్చినట్లు తెలుస్తోంది. 

చిరంజీవి తో నటించిన ఒకనాటి గ్లామర్ బ్యూటీలు ఖుష్బూ రాధిక సుమలత నదియా భాగ్యశ్రీ రమ్యకృష్ణ జయసుధ లిజీ పూర్ణిమ భాగ్యరాజ్ లతో పాటు అనేకమంది చిరంజీవితో నటించిన అలనాటి గ్లామర్ బ్యూటీలు వచ్చినట్లు టాక్. ముఖ్యంగా ఈకార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీకాంత్ రావడం హాట్ న్యూస్ గా మారింది. 

వీరితో పాటు వెంకటేష్ సురేశ్ భానుచందర్ నరేశ్ లు ఈకార్యక్రమంలో పాల్గొనడంతో ఈపార్టీ సందడి వాతావరణంలో జరిగినట్లు తెలుస్తోంది. వీరే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టినా అంబాని జాకీ ష్రాఫ్ లు కూడ రావడం ఈకార్యక్రమానికి హైలెట్ గా మారింది. ఈ రీ యూనియన్ పార్టీ ప్రారంభం అయిన దగ్గర నుండి చిరంజీవి ప్రతి విషయం దగ్గర ఉండి చూసుకోవడమే కాకుండా పార్టీకి వచ్చిన సెలెబ్రెటీలకు చిరంజీవి స్వయంగా హ్యాండ్ టవల్స్ అందించడం దగ్గర నుండి రకరకాల పదార్ధాలతో కూడిన డిషెస్ ను చిరంజీవి స్వయంగా అందరికీ వడ్డించడంతో ఈపార్టీకి వచ్చిన వారంతా జోష్ లోకి వెళ్ళి పోయారని తెలుస్తోంది. 

ఈపార్టీకి వచ్చిన సెలెబ్రెటీలు అంతా ఒకే డ్రెస్ కోడ్ లో ఉండటమే కాకుండా రకరకాల జోక్స్ అలనాటి పాటలకు స్టెప్స్ వేయడమే కాకుండా ఒకనాటి ఈగ్లామర్ బ్యూటీలు ర్యాంప్ వాక్ చేయడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఈ రీ యూనియన్ పార్టీకి వచ్చిన సెలెబ్రెటీ లకు చిరంజీవి తన ఇంటిలో ప్రత్యేకమైన వసతి ఏర్పాటు చేయడమే కాకుండా రకరకాల డ్రింక్స్ కూడ సర్వ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రీ యూనియన్ పార్టీ ఈరోజు కూడ కొనసాగుతున్న నేపధ్యంలో చిరంజీవి ఇంటిలో ఒక పండుగ వాతావరణం కనిపిస్తున్నట్లు టాక్..

 

మరింత సమాచారం తెలుసుకోండి: