ఒక ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్‌లో తీన్మార్ వార్తలతో సందడి చేసిన శివజ్యోతి అలియాస్ సావిత్రి మూడు నెలల క్రితం ఆ ఛానెల్‌కు దూరమైంది. బిగ్ బాస్ షోలో అవకాశం రావడంతో సుమారు 100 రోజుల పాటు మా టీవీలో సందడి చేసింది. సావిత్రి బిగ్ బాస్‌కు వెళ్లిపోయిన కొన్ని రోజులకే చేవెళ్ల రవి అలియాస్ బిత్తిరి సత్తి సైతం V6 ఛానెల్ నుంచి బయటకు వచ్చేశారు. టీవీ9 ఛానెల్‌లో చేరి ఇస్మార్ట్ సత్తిగా కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఐతే కొన్ని రోజుల క్రితం బిగ్ బాస్ గేమ్ షో పూర్తవడంతో శివజ్యోతి నెక్ట్స్ ఏం చేస్తుందన్న ప్రశ్న ఆమె అభిమానుల్లో తలెత్తింది. తీన్మార్ వార్తలతో ఆమె అభిమానుల మనసును కొల్లగొట్టింది.దీనికి తోడు బిగ్బవ్స్ షో ద్వారా ఆమె తన అభిమానులతో పాటు  ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గరైంది    

 

 

టీవీ స్క్రీన్‌పై తెలంగాణ యాసలో శివజ్యోతి మళ్లీ వార్తలు చదవబోతోంది. ఇటీవలే ఆమె టీవీ9 ఛానెల్‌లో చేరింది. V6లో సందడి చేసిన బిత్తిరి సత్తి-సావిత్రి కాంబినేషన్ ఇప్పుడు టీవీ9 స్క్రీన్‌‌పై కొనసాగబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రోమో విడుదల చేసింది టీవీ9. ఐతే V6లో సావిత్రి పేరుతో బాగా పాపులరైన శివజ్యోతి.. బిగ్ బాస్‌ హౌస్‌లో మాత్రం తన ఒరిజినల్ పేరు (శివజ్యోతి)తోనే కంటిన్యూ అయింది. మరి టీవీ9లో సావిత్రి పేరుతో సందడి చేస్తుందా? లేదంటే కొత్త పేరేమైనా పెట్టారా? అన్నది తెలియాల్సి ఉంది.

 

బిత్తిరి సత్తి టీవీ 9 లో చేరడంతో చాలా మంది సావిత్రి కూడా వెల్తుందని అనుకున్నారు.చివరకు శివ జ్యోతి అలియాస్ సావిత్రి దాన్ని నిజం చేస్తూ టీవీ 9 కు వెళ్ళిపోయింది .అప్పట్లో బిత్తిరి సత్తి v6  ఛానల్ ను వీడడం వెనక అనేక రాజకీయ కారణాలు వున్నాయనే పుకార్లు షికారు చేశాయి. ఇప్పుడు సావిత్రి కూడా వెళ్లడంతో ఆ పుకార్లకు మరింత బలం చేకూరింది.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: