అనుకున్నట్లే అయింది,జయలలిత బయోపిక్ టీజర్ విడుదల చేశారో లేదో అప్పుడే గొడవలు మొదలు అయ్యాయి. ఒకవైపు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ల పై ఆమె బంధువులు కోర్టులకు ఎక్కారు. వాటిని ఆపాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు. తమిళనాట అన్నాడీఎంకే అధికారంలో ఉంది కావున ఈ సినిమా ఇప్పట్లో విడుదల అవుతుందా లేదా అనే సందేహాలకు తోడుగా నెటిజన్లు కంగనా లుక్ పై భిన్న స్వరాలూ వినిపిస్తున్నారు. జయలలిత బయోపిక్ ల రూపకర్తలు మాత్రం లుక్స్ మీద లుక్స్ విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఇలాంటి సినిమాలు రెండు మేకింగ్ లో ఉన్నాయి. వాటిల్లో ఒకదాంట్లో నిత్యామీనన్ టైటిల్ రోల్ లో నటిస్తోంది. మరోటి కంగనా రనౌత్ ది.

 

  జయలలితగా నిత్యామీనన్ ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదల చేశారు. అది మార్ఫింగ్ పిక్చర్ లా అనిపించింది. జయలలిత ఒరిజినల్ పిక్చర్ కు నిత్యామొహాన్ని అతికించి మార్ఫ్ చేసినట్టుగా ఉన్నారు.ఇక కంగనా రనౌత్ జయలలిత లుక్ మాత్రం కామెడీగా మారింది. నెటిజన్లు ఈ విషయంలో ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ట్రోలింగ్ కొనసాగిస్తూ ఉన్నారు. కొందరు  అయితే సరదా కామెంట్లు చేశారు.


   

    కంగనా నీ లుక్ కన్నా కమల్ హాసన్ లేడీ గెటప్ బాగుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు ఐతే కంగనా,నిత్యా వద్దు కమల్ ఏ ముద్దు అంటూ కమల్ హాసన్ ను ఈ వివాదం లోకి లాగేస్తున్నారు. ఇక మరి  కొందరు ఆ మధ్య వచ్చిన మోడీ బయోపిక్ తో ఈ లుక్ ను  పోల్చారు. ఆ సినిమాలో వివేక్ ఒబెరాయ్ మోడి గెటప్ బాగా విమర్శలకు గురైంది. ఆ లుక్ లో వివేక్ ఒబెరాయ్ అటు మోడీలానూ లేడు, ఇటు వివేక్ ఒబెరాయ్ లానూ లేడంటూ నెటిజన్లు ఆటపట్టించారు. ఇప్పుడు జయలలితగా కంగనా పరిస్థితి కూడా అలానే  ఉందని వారంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: