దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు - మంచు మనోజ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఝుమ్మంది నాదం. ఈ చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్ తాప్సీ. ఈ సినిమా తర్వాత మిస్టర్ ఫర్ఫెక్ట్, వీరా, మొగుడు వంటి చిత్రాల్లో నటించింది. అయితే, ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దాంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. తన సినీ జీవితాన్ని మరొకసారి పరీక్షించుకుంది. లక్కీగా, తెలుగు ఇండస్ట్రీలో కంటే బాలీవుడ్ సినీరంగంలో తను బాగా రాణిస్తుంది.




ఆమెకు బాలీవుడ్ సినిమాల్లో కి వెళ్లిన దగ్గరనుంచి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి... కానీ వాటినన్నిటినీ ఎదుర్కొంటూ అందరి బాలీవుడ్ యంగ్ హీరోయిన్ల కంటే తెలివైనదని ఎన్నో సందర్భాలలో తాప్సీ నిరూపించింది.
ఇక సెలబ్రిటీస్ మీడియా సమావేశాల్లోకి గాని, పబ్లిక్ లోకి గాని వస్తే చాలు... కొంతమంది జర్నలిస్టులు... ఇంకా ప్రజలు... వారిని ఎలా ఆడుకోవాలా అని వింత ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అటువంటి సంఘటనే ఈరోజు తాప్సికు ఎదురైంది.


వివరాల్లోకి వెళ్తే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో పాల్గొంది తాప్సీ.. దాంట్లో భాగంగా ప్రేక్షకులతో కాసేపు ముఖాముఖీ మాట్లాడిన తాప్సీ.. మొత్తంగా ఇంగ్లీష్‌లో మాట్లాడుతుండంతో... అక్కడే ఉన్న ఒక ప్రేక్షకుడు 'మేడం, మీరు ఇంగ్లీష్ లో ఎందుకు మాట్లాడుతున్నారు...హిందీలో ఎందుకు మాట్లాడట్లేదు?' అంటూ ప్రశ్నించాడు. దానికి... తాప్సి 'ఇక్కడ ఉన్న వారందరికీ హిందీ అర్థం కాకపోవచ్చు కదా!' అంటూ ఎదురు ప్రశ్నించింది.. అప్పటితో ఆగని ఆ ప్రేక్షకుడు.. ' మీరు హిందీ నటి కాబట్టి హిందీ లోనే మాట్లాడాలి' అంటూ వాదించాడు. అయితే, దీనికి కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చింది తాప్సీ.. 'నేను దక్షిణాది నటిని కూడా.. మరి, తమిళం, తెలుగులో మాట్లాడానా? అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. దీంతో మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని ఆ ప్రేక్షకుడు... అతని మొహం చిన్నబోయి నోర్ముసుకొని కూర్చున్నాడు. తాప్సి తెలివైన పంచ్ ని విన్న.. ఇతర ప్రేక్షకులు గట్టిగ చప్పట్లు కొట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: