దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీయార్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ను జూనియర్ ఎన్టీయార్ కు జోడీగా డైసీ ఎడ్గార్ జోన్స్ ను రాజమౌళి మొదట ఫైనల్ చేశాడు. మొదట ఈ సినిమాలో నటించడానికి అంగీకరించిన డైసీ ఆ తరువాత మాత్రం కొన్ని అనివార్య కారణాల వలన ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేసింది. 
 
ఆ తరువాత ఎన్టీయార్ కు జోడీగా అమెరికాకు చెందిన ఎమ్మా రాబర్ట్స్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అధికారికంగా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఎమ్మా రాబర్ట్స్ గురించి ప్రకటన చేయకపోవటంతో వచ్చిన వార్తలు నిజం కాదని తేలిపోయింది. మరో ఎనిమిది నెలల్లో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కాబోతుంది. కానీ ఎన్టీయార్ హీరోయిన్ గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవటంతో ఎన్టీయార్ ఫ్యాన్స్ కంగారు పడ్డారు. 
 
కానీ చివరకు రాజమౌళి జూనియర్ ఎన్టీయార్ కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తున్నట్లు ప్రకటించారు. ఒలీవియా మోరిస్ గతంలో రాజమౌళి ఎంపిక చేసిన నటి కంటే అందంగా ఉందని ఎన్టీయార్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తూ దర్శకధీరుడు రాజమౌళిని మెచ్చుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఒలీవియా మోరిస్ జెన్నీఫర్ పాత్రలో కనిపించనుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీం ను ఇష్టపడే బ్రిటిష్ అమ్మాయి పాత్రలో ఒవీలియా మోరిస్ నటించబోతుంది. 
 
ఈ సినిమాలో కేవలం 20 నిమిషాల పాటు ఒలీవియా కనిపించబోతుందని సమాచారం. ఆర్ఆర్ఆర్ సినిమా 2020 జులై 30వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సంవత్సరం డిసెంబర్ 31 లేదా 2020 జనవరి 1వ తేదీన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నాడని సమాచారం. దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: