నాగచైతన్య కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాడు. ఇమేజ్ లెక్కలని పక్కనపెట్టి కొత్తకొత్త పాత్రలు పోషిస్తున్నాడు. ఒక సినిమాలో మిడిల్ క్లాస్ కుర్రాడిగా.. మరో మూవీలో జవాన్ గా నటిస్తున్నాడు. ఒక దానితో మరొకటి సంబంధం లేని క్యారెక్టర్స్ తో సర్ ప్రైజ్ చేయబోతున్నాడు. 


నాగచైతన్యకు లవర్ బాయ్ గా సూపర్ ఇమేజ్ ఉంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ తో ఫీమేల్ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అయితే నాగచైతన్య మాత్రం ఇప్పుడీ ఇమేజ్ కు భిన్నంగా కొంచెం నేచురల్ గా ఉండే పాత్రలు పోషిస్తున్నాడు. హీరోయిజాన్ని పక్కనపెట్టి కథలో భాగమవుతున్నాడు యువ సామ్రాట్. 


నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సిినిమా చేస్తున్నాడు. నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో చైతన్య మిడిల్ క్లాస్ కుర్రాడిగా కనిపిస్తున్నాడు. చీపురుపట్టి ఇల్లు శుభ్రం చేస్తూ రియలిస్టిక్ క్యారెక్టర్ గా మారాడు నాగచైతన్య. 


వెంకీమామ సినిమాలో నాగచైతన్య జవాన్ పాత్ర పోషించాడు. గన్నుపట్టి శత్రువుల భరతం పట్టే కేప్టెన్ కార్తీక్ శివరామ్ అనే క్యారెక్టర్ గా మారాడు. సో ఈ రెండు సినిమాలు చూస్తే.. నాగచైతన్య లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయటకు వస్తున్నట్టు కనిపిస్తోంది. మరి నాగచైతన్యకు కొంచెం కొత్తగా ఉండే ఈ క్యారెక్టర్స్ కు ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. నాగచైతన్య రాబోయే సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎపుడెపుడు తన అభిమాన హీరోను కొత్త లుక్ లో చూద్దామా అని ఆసక్తితో ఉన్నారు. వెంకీమామ మూవీలో చైతూ నటనకు ఖచ్చితంగా అభిమానులు ఫిదా అవుతారని గట్టిగా టాక్ వినిపిస్తోంది. కొత్త కొత్త క్యారెక్టర్లు చేస్తూ.. ఫ్యాన్స్ ను ఫిదా చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు ఈ అక్కినేని హీరో. 

మరింత సమాచారం తెలుసుకోండి: