ఆర్ఎక్స్ 100 సినిమాతో  టాలీవుడ్ కి  హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమా తోనే సెన్సేషన్ సృష్టించిన సృష్టించింది ఈ హాట్ భామ . మొదటి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులందరినీ తనవైపు తిప్పుకొని... ఓ రేంజ్ లో ఫేమస్ అయిపోయింది పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమానే బోల్డ్ కంటెంట్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఆర్ఎక్స్ 100 సినిమాలో తన అందాల ఆరబోతతో తెలుగు ప్రేక్షకులందరూ మతి పోగొట్టింది. ఈ సినిమాలో తన హావభావాలు, అందాలతో  కుర్రకారు అందరికీ చమటలు పట్టించింది. టాలీవుడ్ లో ఇప్పటి వరకు తెలియని బోల్డ్  కంటెంట్  అంటే ఏంటో చేసి నిరూపించింది ఈ అమ్మడు. ఇక ఆర్ఎక్స్ 100 సినిమా తో పాయల్ రాజ్ పుత్ అందరికీ అందాల దేవత గా మారిపోయింది. అందుకే పాయల్ రాజపుత్  నుంచి ఏదైనా సినిమా వస్తుంది అంటే అది ఓల్డ్ సినిమానే అంటూ  ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రేక్షకులు . అంతేకాదండోయ్ ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫేమస్ అయిపోయింది పాయల్  పాప. 

 

 

 

 అటు దర్శకులందరికి బోల్డ్ సినిమాలకి  కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. అంతేకాదు ఈ అమ్మడు ఎంచుకునే సినిమాలు కూడా బోల్డ్ సినిమాలే ఉన్నాయి. అయితే పాయల్ రాజ్ పుత్ నటించిన రెండు సినిమాలు బోల్డ్  కంటెంట్ తోనే  ఉండడంతో దర్శకులు కూడా ఈ అమ్మడు వద్దకు  అలాంటి సినిమా కథలను తీసుకెళ్తున్నారు. ఇక అటు ప్రేక్షకుల్లో కూడా పాయల్ రాజ్ పుత్ సినిమా వస్తుందంటే అది ఏ సర్టిఫికెట్ సినిమా అని డిసైడ్ అయి పోతున్నారు. కానీ అటు పాయల్ రాజ్ పుత్ మాత్రం తాను బోల్డ్ కంటెంట్  చేసే హీరోయిన్ మాత్రమే కాదని నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా చేస్తాను అంటూ చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. ఒకవేళ దర్శకులు తన దగ్గరికి మంచి కంటెంట్ ఉన్న కథలు తీసుకొస్తే తన రెమ్యూనరేషన్ కూడా తక్కువ  తీసుకోవడానికి కూడా సిద్ధమంటున్నది . అయినప్పటికీ ఈ అమ్మడు  దగ్గరికి మాత్రం బోల్డ్ సినిమా కథలే  ఎక్కువగా వస్తున్నాయి . 

 

 

 

 అయితే ప్రస్తుతం ఈ అమ్మడికి వరుస సినిమా అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న డిస్కో రాజా సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు విక్టరీ వెంకటేష్ అక్కినేని నాగచైతన్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వెంకీ మామ సినిమాలో కూడా నటిస్తోంది పాయల్ రాజ్ పుత్. ఇదిలా ఉంటే తాజాగా పాయల్ రాజ్ పుత్ దగ్గరికి ఓ దర్శకుడు ఓ బోల్డ్ కథను తీసుకొచ్చి వినిపించినట్లు సమాచారం. అయితే కథ వినేందుకు  పాయల్ రాజ్ పుత్ ఓకే చెప్పడంతో నేరేషన్  ప్రారంభించాడు దర్శకుడు. అయితే కథ చెప్పడం మొదలు పెట్టిన 30 నిమిషాల్లోనే 5 బెడ్ రూమ్ సన్నివేశాలను చెప్పాడట ఆ దర్శకుడు.దీంతో  పాయల్ రాజ్ పుత్ ఎంతో సున్నితంగా దర్శకుని కథను  రిజెక్ట్ చేసేందట . అంతేకాదండోయ్ ఈ అమ్మడు  ఇప్పట్లో బోల్డ్ కంటెంట్ జోలికి వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మంచి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేయాలని ఈ అమ్మడు నిర్ణయించుకుందట. మరి డిస్కో రాజావెంకీ మామ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తున్నదో  తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: