నవంబర్ ను చామంది టాలీవుడ్ దర్శక, నిర్మాతలు అన్ సీజన్ గా భావిస్తారు. అందుకే ఈ నెలలో క్రేజీ ప్రాజెక్టులు.. స్టార్ హీరోల సినిమాలను రిలీజ్ చేయడానికి ఎవరు సాహసం చేయరు. అటు దసరా... ఇటు క్రిస్మస్ కు ఆ సినిమాలను విడుదల చేస్తారు. దీంతో నవంబర్ కు పెద్ద సినిమాల ఎఫెక్ట్ అంతగా ఉండదు. అందుకే ఎక్కువగా చిన్న సినిమాలు ఈ నెలలో విడుదల అవుతాయి. కాస్త బావున్న పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి. దాంతో చిన్న సినిమా నిర్మాతలు గట్టెక్కేస్తారు. అయితే ఈ సారి నవంబర్ అన్ సీజన్ అనే అభిప్రాయానికి తగ్గట్టే ఈ నెలలో రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువ శాతం ఫ్లాప్స్ గా నిలిచాయి. 

 

విజయ్ దేవరకొండ నిర్మాణంలో తెరకెక్కిన 'మీకు మాత్రమే చెప్తా' టార్గెట్ చిన్నదే అయినా హిట్ అందుకోలేకపోయింది.  '7 చేపల కథ' కు మొదటి రోజు మంచి కలెక్షన్స్ వచ్చాయి. కానీ తర్వాత కథ అడ్డం తిరిగింది. శ్రీవిష్ణు 'తిప్పరా మీసం' డిజాస్టర్ గా నిలిచింది. విశాల్ నటించిన 'యాక్షన్' కు అసలు తెలుగు ప్రేక్షకుల నుండి రెస్పాన్సేలేదు. విజయ్ సేతుపతి నటించిన 'విజయ్ సేతుపతి' సినిమాకు కూడా అసలు ఏమాత్రం కలెక్షన్స్ లేవు.  'తెనాలి రామకృష్ణ BA.BL'సందీప్ కిషన్ ఖాతాలో మరో పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. జ్యోతిక నటించిన 'జాక్ పాట్' ను కూడా ప్రేక్షకులు పట్టించుకో లేదు. కనీసం ఓ లుక్ కూడా వేయలేదని చెప్పాలి. ఇక ఈ శుక్రవారం విడుదలైన సినిమాలలో ఈషా రెబ్బా నటించిన 'రాగల 24 గంటల్లో'.. 'జార్జ్ రెడ్డి' కలెక్షన్స్ పరిస్థితి ఈ వీకెండ్ తర్వాత మనకు అర్థం అవుతుంది. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ పరంగా మాత్రం ఈ సినిమాల పరిస్థితి ఏం గొప్పగా లేదని తెలుస్తోంది. 

 

ఇవి కాకుండా నవంబర్ లో చిన్న సినిమాలు బాగానే రిలీజైనప్పటికి వాటిపై ప్రేక్షకులు రవ్వంత కూడా ఆదరణ చూపలేదు. ఇప్పటివరకూ చూసుకుంటే నవంబర్ సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచాయనే చెప్పాలి. ఇక ఈ నెలాఖరున విడుదల కానున్న సినిమాల్లో నిఖిల్ 'అర్జున్ సురవరం'.. గౌతమ్ మీనన్-ధనుష్ కాంబోలో వస్తున్న 'తూటా' ఉన్నాయి. ఇవి ఎన్నో వాయిదాల తర్వాత రిలీజ్ అవుతున్న సినిమాలు. మరి ప్రేక్షకులను ఈ సినిమాలు ఏ మాత్రం ఆకట్టుకుంటాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: